ANR National Awards 2024 : అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాల వేడుక (ANR National Awards 2024)ను ఈ ఏడాది అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో అమితాబ్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరు మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే ఇంట గెలిచి రచ్చ గెలిచాను అంటూ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని వెల్లడించారు. ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా పొగడలేదు అంటూ తన తండ్రి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ను బయట పెట్టారు.
చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ “నేను సినిమాలు చేయడం మొదలుపెట్టాక బయట వ్యక్తుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. ఎంతోమంది అభిమానులు కూడా అయ్యారు. వాళ్లు వీళ్లు పొగడడం చూసాను. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ మా ఇంట్లో పరిస్థితి చూస్తే మాత్రం అలా అనిపించేది కాదు. ఎంతోమంది ఎన్నో చెప్పినప్పటికీ ఇంట్లో వాళ్ళు పొగిడితే ఆ జోష్ వేరేగా ఉంటుంది. కానీ మా నాన్నగారు ఒక్కసారి కూడా నేను ఎలా చేశాను అనే విషయాన్ని సూటిగా చెప్పలేదు. దీంతో నాకు ఎప్పుడూ ఆయనకు సినిమాలంటే ఇంత ఇష్టం కదా… ఒక్కసారి కూడా నేను సినిమాలు ఎలా చేశానో అనే విషయాన్ని చెప్పరేంటి? అని సందేహం కలిగేది. ఒక ఒక టైంలో మా అమ్మను ఈ విషయాన్ని డైరెక్ట్ గా అడిగాను. ఏంటమ్మా ఆయన ఒక్కసారి కూడా నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడరు అని అంటే… మా అమ్మ లేదురా ఆయనకు ఈ సినిమాలంటే చాలా ఇష్టం. ఇక ననీ యాక్టింగ్ గురించి కూడా తరచుగా పొగుడుతారు. కానీ పిల్లలను పొగిడితే వాళ్ళ ఆయుష్షుకు మంచిది కాదు అని నీ ముందు చెప్పరంతే అని అనేవారఇన్ చెప్పింది. అయితే ఒకానొక టైం లో మా నాన్న నాకు సంబంధించిన మ్యాగజైన్ ఫోటోలు అన్నీ ముందర వేసుకొని ఓ రేంజ్ లో పొగడడం చూశాను. అందులో కొన్ని బూతు పదాలు కూడా మిక్స్ అయ్యాయి. అది విన్నాక అప్పుడు అనుకున్నాను నేను రచ్చ కాదు ఇంట కూడా గెలిచాను అని” అంటూ చెప్పుకొచ్చారు.
“అలా ఇంట గెలిచి రచ్చ గెలవమంటే… నేనేమో ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి తనకు ఈ సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని ఏఎన్ఆర్ అవార్డుల వేదికగా బయట పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వారి అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన ఎక్కడా ఈ విషయాన్ని ఒక్కసారి కూడా బయట పెట్టలేదు. కానీ ఏఎన్ఆర్ అవార్డుల వేదిక (ANR National Awards 2024)పై తన మనసులోని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు చిరు (Chiranjeevi). ఇక ఇలాంటి అత్యంత అరుదైన గౌరవం చిరంజీవిని వరించడం పట్ల మెగాస్టార్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.