Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) తెలుగు, తమిళ్ భాషా ఇండస్ట్రీలలో మంచి పేరు సంపాదించుకున్నారు.ముఖ్యంగా ఈయన టాలెంట్ ని చూసి మెగా ఫ్యామిలీ ఈయనను ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. దీనికి తోడు రామ్ చరణ్ తన రచ్చ సినిమాలో డిల్లకు డిల్లకు పాటకు కొరియోగ్రఫీ అందించే అవకాశాన్ని ఇచ్చాడు. దీంతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు జానీ మాస్టర్. ఈ ఒక్క పాటతో ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఈ పాట కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. ఈ ఒక్క పాటతో ఆయన తలరాతే మారిపోయిందని చెప్పాలి.
మెగా కుటుంబానికి తోడుగా జానీ మాస్టర్..
ఈ పాట ఇచ్చిన క్రేజ్ కు అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (NTR) లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే ఎక్కువగా మెగా ఫ్యామిలీకి సపోర్టు చేస్తూ వచ్చారు జానీ మాస్టర్. కాబట్టి ఈయనను ఎలాగైనా సరే బుక్ చేయాలనే ఉద్దేశంతోనే కొంతమంది ప్రణాళిక వేసుకొని మరీ జానీ మాస్టర్ ను అడ్డంగా బుక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కూడా ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అన్ని విషయాలలో రైట్ హ్యాండ్ గా ఉండే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి కూడా అండగా నిలిచారు. అంతేకాదు పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎంతో సహాయపడ్డారు. ముఖ్యంగా జనసేన పార్టీకి అండగా నిలిచి ప్రచారం కూడా చేశారు. ఇక ఈయన హార్డ్ వర్క్ చూసి మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఈయనను ఓన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓర్వలేక కొంతమంది ఎలాగైనా సరే మెగా ఫ్యామిలీకి దూరం చేసి, జనసేన పార్టీ నుంచీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో కావాలని ఈయనను లైంగిక వేధింపుల కేసులో ఇరికించారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
జానీ మాస్టర్ పై కుట్ర పన్నిన స్టార్ హీరో..
అంతే కాదు ఇందులో ఒక స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ అయ్యాడనే వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం జానీ మాస్టర్ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మునుపటి లాగా జానీ మాస్టర్ కి అవకాశాలు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే కొంతమంది జానీ మాస్టర్ మంచితనానికి ఫిదా అవుతూ.. ఆయనకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయని చెబుతుంటే, మరి కొంతమంది ఇలాంటి ఆరోపణలలో ఇరుక్కున్న వ్యక్తికి ఇంకెవరు అవకాశాలు ఇస్తారు అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జానీ మాస్టర్ తనకంటూ ఐడెంటిటీ సంపాదించుకున్న తర్వాత ఇలాంటివి జరగడం ఆయన కెరియర్ పై పెద్ద దెబ్బ పడేలా చేశాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల ఈయనకు రావాల్సిన జాతీయ అవార్డును కూడా నిలిపివేశారు.