EPAPER

Akkineni Nagarjuna: చిరంజీవిని చూసి భయపడి.. వేరే దారి వెతుక్కున్నాను

Akkineni Nagarjuna: చిరంజీవిని చూసి భయపడి.. వేరే దారి వెతుక్కున్నాను

Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేడు ఏఎన్నార్ నేషనల్  అవార్డ్  2024 వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది.. ఏఎన్నార్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డును చిరంజీవి  అందుకున్నారు. ఇక అవార్డు అనంతరం చిరు .. ఏఎన్నార్ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. ఇక చిరంజీవి గురించి, అమితాబ్ బచ్చన్ గురించి అక్కినేని నాగార్జున ఎంతో అద్భుతంగా మాట్లాడాడు.


” ఏఎన్నార్.. ఈ మూడు పదాలే నాకు ప్రపంచం. ఇది నాకే కాదు నా ఫ్యామిలీకి , ఫ్రెండ్స్ కి, ఫ్యాన్స్ కు కూడా.  ఏఎన్నార్ ఫిలాసఫీని నమ్ముతున్నారు. ఆయన నమ్మకాల్లో అది ఒకటి. ఆయన కుటుంబాన్ని, ప్రేక్షకులకు నమ్ముతారు. ఎక్కువగా సినిమాను నమ్ముతారు. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు చాలా తక్కువమందిలో కనిపిస్తున్నాయి. అందుకే ఆయనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నాం. నా తల్లికి ఆయన దైవంగా భావించే భర్త.. పిల్లలకు మంచి తండ్రి..  సినిమాను దైవముగా భావించే వ్యక్తి. ఆయన తన జీవితాన్ని మొత్తం ఒక కాన్సెప్ట్. ఏఎన్నార్  అవార్డ్.. అలాంటి లక్షణాలు ఉన్నవారికే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు స్టేజిమీద అలాంటి పర్సనాలిటీస్ ఉన్నారు.  వారే ఇండియన్ సినిమాకు ABC. AB అంటే అమితాబ్ బచ్చన్ జీ .. C అంటే మెగాస్టార్ చిరంజీవి.

ANR National Awards 2024 : ఆ అవార్డును అందులో పడేశా.. పద్మభూషన్, పద్మవిభూషన్ ఎన్నొచ్చినా.. చిరు షాకింగ్ కామెంట్స్


ఈ ఏడాది  ఏఎన్నార్ అవార్డును నా స్నేహితుడు చిరంజీవికి ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.  అది కూడా నేను చిన్నప్పటి నుంచి ఎంతో గొప్పగా అభిమానించే అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇవ్వడం ఇంకా ఆనందంగా ఉంది. అమిత్ జీ.. కొన్నేళ్ల క్రితం ఏఎన్నార్ అవార్డును మీకు ఇస్తామని అన్నప్పుడు.. మీరు వెంటనే ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ అవార్డు మరింత ప్రెస్టీజియస్ గా మారింది. ఇప్పుడు మరోసారి చిరంజీవి గారికి ఆ అవార్డును అందివ్వడానికి వచ్చినందుకు నేను మళ్లీ థాంక్స్ చెప్తున్నాను.  కల్కిలో అమితాబ్ జీ ని చూసి.. ఆయనకు కాల్ చేసి.. నా ఒరిజినల్ మాస్ హీరో బ్యాక్ అని చెప్పాను. అమిత్ జీ.. మీరు చేసిన సినిమాలు, పాత్రలు, నటనకు మేము ఎంతో పెద్ద ఫ్యాన్స్.  మీరు ఇలాంటివి మరెన్నో చేయాలనీ కోరుకుంటున్నాం.

ఇక చిరంజీవి గారి గురించి  చెప్పాలంటే..  చిరంజీవి గారితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన హిట్లు, సూపర్ హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలుసు. ఇక ఈ మధ్యనే గిన్నిస్ బుక్ రికార్డ్ లో కూడా  ఎక్కారు. నేను సినిమాల్లోకి రావాలనుకున్న సమయంలో.. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చిరంజీవి సినిమా  షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఆయన డ్యాన్స్  చూశాను. అప్పుడే నాన్న నన్ను చూసి.. సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్ కదా.. వెళ్లి చూసి నేర్చుకో అని పంపారు. అక్కడ రెయిన్ సాంగ్ షూట్ చేస్తున్నారు.  వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చిరు.. రాధతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆయన గ్రేస్ చూసి నాకు మనసులో గుబులు పుట్టింది. ఆయనకు భయపడి.. సినిమా కాకుండా వేరే దారి వెతుక్కుందాం అని బయటకు వచ్చేశాను.

Chiranjeevi: అమితాబ్ చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్

ఇక చిరంజీవి గారు ఎంతడౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటే.. ఇదే స్టేజి మీద అమితాబ్ కు అవార్డు ఇచ్చేరోజున.. ఆయన్ను వెళ్లి పిలిచాను. నేను పిలవగానే వస్తాను అని చెప్పారు. కొన్ని ప్రొటోకాల్స్ వలన స్టేజి పైకి రాలేదు. అయినా కింద మొదటి వరుసలో కూర్చొని.. నాగ్.. అమితాబ్ కు శాలువా కప్పొచ్చా .. ?  అని అడిగారు. అందులో ఏముంది అని చెప్పాను. ఇదంతా ఎందుకు  చెప్తున్నాను అంటే.. ఆయన హుంబుల్ పర్సన్ అని చెప్తున్నాను. ఇక ఆయన స్టేటస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

చిరంజీవి గారు ప్రజల కోసం చేసిన సేవలు గురించి చెప్పాలి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ .. ఇలా ఎంతోమంది ప్రాణాలను ఆయన కాపాడారు.  కరోనా వచ్చిన సమయంలో మెగాస్టార్  చేసిన సేవలు మర్చిపోలేనివి. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. సమాజం నుంచి మనం ఏదైనా తీసుకుంటే.. తిరిగి ఆ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని.. అమితాబ్ జీ , చిరంజీవి గారిలో దాన్ని నేను చూసాను. ఇలాంటి వీరిద్దరి గురించి నేను ఏం చెప్పను.. ఒకటే మాట.. ఇండియన్ సినిమాకు ABC” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×