EPAPER

ANR National Awards 2024 : ఆ అవార్డును అందులో పడేశా.. పద్మభూషన్, పద్మవిభూషన్ ఎన్నొచ్చినా.. చిరు షాకింగ్ కామెంట్స్

ANR National Awards 2024 : ఆ అవార్డును అందులో పడేశా.. పద్మభూషన్, పద్మవిభూషన్ ఎన్నొచ్చినా.. చిరు షాకింగ్ కామెంట్స్

ANR National Awards 2024 : మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది గుడ్ టైం నడుస్తోంది. వరుసగా ఆయనను అవార్డుల మీద అవార్డులు వరిస్తున్నాయి. రీసెంట్ గా పద్మ విభూషణ్ అందుకున్న చిరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే ఐఫా వేదికపై ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకున్నారు. అంతలోనే మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా వరించింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తన ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి ఏఎన్ఆర్ అవార్డుల (ANR National Awards 2024) వేదికపై బయట పెడుతూ వజ్రవత్సవాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అందులో భాగంగానే ఆయన రచ్చ గెలిచి ఇంట ఎలా గెలిచారు అనే విషయాన్ని కూడా వివరించారు. ఓ అవార్డును తీసి పక్కన పారేశాను అంటూ గతంలో జరిగిన వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. మరి ఆ అవార్డు ఏంటి? ఎందుకు చిరు పక్కన పడేశారు? అనే వివరాల్లోకి వెళ్తే…


మెగాస్టార్ చిరంజీవిని ‘ఖైదీ’ సినిమా ఊహించని మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి మొదలుపెట్టి దశాబ్దాల పాటు విజయ పరంపరను కొనసాగిస్తున్న చిరంజీవి (Chiranjeevi) ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిరుగులేని స్టార్ హీరోగా ఇన్నేళ్లపాటు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవిని ఎన్నో అవార్డులు వరించాయి. అందులో వజ్రోత్సవం అవార్డు కూడా ఒకటి. తాజాగా ఆ అవార్డును తీసి పక్కన పడేసాను అంటూ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చిరంజీవి ఏఎన్ఆర్ అవార్డుల వేదికపై గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ “ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు… కానీ నేను ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలిచినట్టుగా అనిపిస్తోంది ఈ అవార్డును అందుకుంటుంటే… ఎందుకు చెబుతున్నాను అంటే గతంలో నాకు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేయాలి. అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ నన్ను వజ్రోత్సవం అవార్డుతో సత్కరించాలి అనుకున్నప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ అవార్డును అందుకున్నప్పుడు కొంతమంది విమర్శించడంతో బాధపడి వజ్రోత్సవం అవార్డుని టైం క్యాప్సిల్స్ లో వేసాను. అవార్డును అందుకోవడానికి అర్హత వచ్చినప్పుడే అందుకుంటాను అని ఫిక్స్ అయ్యాను. అయితే ఇప్పుడు తాజాగా నా ఫ్రెండ్ నాగార్జున వచ్చి స్వయంగా ఈ అవార్డును అందుకోవడానికి మీరు అర్హులు అన్నప్పుడు నేను ఇంట కూడా గెలిచాను అని అనిపించింది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నా ఇల్లు అనుకుంటున్నాను నేను. ఇందులో ఉన్న అందరూ నా కుటుంబ సభ్యులే. కాబట్టి స్వయంగా కుటుంబ సభ్యులు పిలిచి ఇలా గౌరవించడం అంటే నేను అర్హత సాధించినట్టే. పద్మ విభూషణ్, పద్మభూషణ్ తో పాటు ఎన్నో పెద్ద అవార్డులు వచ్చినా ఇదే ప్రత్యేకం” అంటూ గతంలో జరిగిన అవమానాన్ని మరోసారి గుర్తు చేశారు చిరంజీవి. వజ్రోత్సవాల సమయంలో ఏమైందంటే… కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వేదికపైనే చిరంజీవిని అవమానించారు. తాను చిరంజీవి కంటే ఎక్కువ సినిమాలు చేశానని, ఇండస్ట్రీలో చిరంజీవి కంటే గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నా అవార్డు ఎందుకు ఇవ్వలేదు అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.


Related News

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

×