Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. చరణ్ కెరీర్ మొదలుపెట్టినప్పుడు లుక్ పరంగా ఎన్నో విమర్శలు అందుకున్నాడు. అసలు చిరు కొడుకేనా .. ఆయన పోలికలే రాలేదు అంటూ విమర్శించారు. కానీ, చరణ్ మాత్రం వాటినేమి పట్టించుకోకుండా తన సత్తా చూపిస్తూ వచ్చాడు. లుక్ పరంగా, నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరు కొడుకు చరణ్ అనే ట్యాగ్ లైన్ ను మార్చి చరణ్ తండ్రి చిరు అని అనిపించుకున్నాడు.
నటన విషయంలో, కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఏ ఈవెంట్ కు వెళ్లినా.. చరణ్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ మెగా హీరో.. అక్కినేని ఈవెంట్ లో హైలైట్ గా మారాడు. నేడు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ అతిరథ మహారథులు అందరూ ఈ వేడుకలో పాల్గొంటున్నారు.
Sobhita Dhulipala: ఏఎన్నార్ అవార్డ్స్ వేడుక.. అక్కినేని కొత్త కోడలి రాయల్ ఎంట్రీ అదుర్స్
ఈ ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి అందుకుంటున్న విషయం విదితమే. అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. తండ్రి అవార్డును అందుకోవడం కళ్లారా చూడడానికి గ్లోబల్ స్టార్ కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. ఇక అక్కడ ఎంతమంది స్టార్స్ ఉన్నా తన స్టైలిష్ లుక్ తో చరణ్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్, స్టైలిష్ కళ్లజోడు, గుబురు గడ్డంతో ఎంతో అద్భుతంగా కనిపించాడు. ప్రస్తుతం చరణ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
RC16 కోసం చరణ్ తన లుక్ మొత్తాన్ని మార్చనున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. RC16 లో ఈ లుక్ తో చరణ్ కనిపిస్తే థియేటర్ లో పూనకాలు గ్యారెంటీ. త్వరలోనే ఈ సినిమాలో చరణ్ అడుగుపెట్టనున్నాడు. ఇక చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి రేసులో దిగిన విషయం తెల్సిందే. దివాళీకి గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో చరణ్- శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Charan in black looks greater than everyone else in any color. pic.twitter.com/WuIT8VrWLt
— Satya (@YoursSatya) October 28, 2024