EPAPER

Diwali Offer 2024 : ఇచ్చిపడేశాడు బ్రో.. రూ.6999కే 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ సహా ఇంకా ఎన్నో

Diwali Offer 2024 : ఇచ్చిపడేశాడు బ్రో.. రూ.6999కే 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ సహా ఇంకా ఎన్నో

Diwali Offer 2024 : దివాళీ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలన్నీ తమ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఇప్పటికే టాప్ బ్రాండ్ సంస్థలన్నీ హై క్వాలిటీ మెుబైల్స్ పై ఆఫర్స్ ప్రకటించగా.. తాజాగా పోకో తమ కస్టమర్లకు దిమ్మతిరిగే ఆఫర్ ను ప్రకటించింది. పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ (Poco C65 Smartphone) ను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉంటడంతో స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎగిరిగెంతేస్తున్నారు.


ఫ్లిప్‌కార్ట్‌ దీపావళీ సేల్‌ 2024 (Flipkart Diwali Sale 2024)లో భాగంగా పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ (Poco C65 Smartphone)ను భారీ డిస్కౌంట్ లో కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ. 6,999 గా ఉంది. ఆకట్టుకునే డిజైన్‌ లో అందుబాటులో ఉన్న ఈ మెుబైల్ ను బ్యాంక్ ఆఫర్స్ పై మరింత తగ్గింపు ధరకే కొనే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ అందిస్తుంది.

ALSO READ : డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? మోదీ చెప్పింది చేస్తే మీరు సేఫ్..


ఫీచర్స్ – పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ మెుబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సదుపాయం కలదు. 4GB RAM + 128GB స్టోరేజీ, 6GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM+ 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది.

ధర – ఇక 4GB RAM వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. అదే 6GB RAM వేరియంట్ ధర రూ.7799, 8GB RAM వేరియంట్ ధర రూ.8499 గా ఉంది.

వేరియంట్స్ – పోకో C65 స్మార్ట్‌ ఫోన్ ప్రస్తుతం మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మ్యాటీ బ్లాక్‌, పాస్టెల్‌ గ్రీన్‌, పాస్టెల్ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

డిస్ ప్లే – 6.74 అంగుళాల HD + (1650*720 పిక్సల్స్‌) డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయింది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ సైతం అందుబాటులో ఉంది.

ప్రాసెసర్‌ – ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS తో పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది. ఇక మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో స్పెషల్ గా గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mali G52 MC2 GPU చిప్‌ సైతం ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకునే అవకాశం ఉంది.

కెమెరా – ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో + AI లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా సైతం ఉంది.

బ్యాటరీ – 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సదుపాయం ఉంది.

కనెక్టివిటీ – ఇందులో కనెక్టివిటీ కోసం 4G LTE, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టు, డ్యూయల్‌ బ్యాండ్‌ Wi-Fi, GPS వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇక ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ అక్టోబర్ 21న ప్రారంభంకాగా.. అక్టోబర్ 31వరకూ అందుబాటులో ఉంది. లిమిటిడ్ సేల్ లో మరిన్ని స్మార్ట్ ఫోన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి.

Related News

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ

Instagram : ఇన్టాగ్రామ్ సేవలు ఆగిపోయాయా.. అసలు ఏమైంది?

Digital Condom App: ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో A3x 4G, ఒప్పో Find X8లో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

BSNL 4G : బీఎస్ఎన్ఎల్ 4G స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ తో చిటికెలో హై స్పీడ్ గా మర్చేయండి

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

×