అక్టోబర్ 28న జన్మించిన అదితి రావు హైదరీ పర్సనల్ లైఫ్‌లో చాలానే కాంట్రవర్సీలు ఉన్నాయి. తను ఒక సులైమానీ బోహ్రా ముస్లిం.

మామూలుగా సినిమాల్లో మహారాణుల గురించి వినుంటాం. కానీ అదితి నిజంగానే ఒక మహారాణి. తనది రాజవంశం.

1869 నుండి 1941 వరకు అదితి తాతయ్య హైదరాబాద్‌కు ప్రధాన మంత్రిగా పనిచేశారు, ముత్తాత జే రామేశ్వర్ రావు.. నైజాంలో సభ్యుడిగా ఉన్నారు.

రాజవంశం, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినా అదితి మాత్రం గ్లామర్ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలనుకుంది.

2006లో విడుదలయిన ‘ప్రజాపతి’ అనే మలయాళ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

17 ఏళ్లకే బాలీవుడ్ యాక్టర్ సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడిన అదితి.. తననే పెళ్లి చేసుకుంది. కానీ ఆరేళ్లకే విడాకులు కూడా ఇచ్చేసింది.

అదితి 34కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’, ‘హీరామండి’ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

సత్యదీప్ మిశ్రాతో ప్రేమ, పెళ్లి ఫెయిల్ అయినా కూడా సిద్ధార్థ్ అనే మరో హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది అదితి.

సిద్ధార్థ్, అదితిల పెళ్లి అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. కొందరు అయితే వీరి రిలేషన్ గురించి వ్యంగ్యంగా కూడా మాట్లాడారు.

అదితి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా తనకు విషెస్ చెప్తున్నారు.