EPAPER

Sobhita Dhulipala: ఏఎన్నార్ అవార్డ్స్ వేడుక.. అక్కినేని కొత్త కోడలి రాయల్ ఎంట్రీ అదుర్స్

Sobhita Dhulipala: ఏఎన్నార్ అవార్డ్స్ వేడుక.. అక్కినేని కొత్త కోడలి రాయల్ ఎంట్రీ అదుర్స్

Sobhita Dhulipala: అదృష్టం.. ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరం చెప్పలేం.  దేవుడి రాసిన రాతలు అలా ఉంటాయి అని చెప్పుకోవడమే. ఏ జంటను ఎప్పుడు కలపాలి.. ? ఏ జంట ఎప్పుడు విడిపోవాలి అనేది ముందే రాసి ఉంటాడు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఒక తెనాలి అమ్మాయి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి.. బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.


తెనాలి అమ్మాయి అయినా కూడా తెలుగువారికి అంతంత మాత్రంగానే తెలుసు అని చెప్పొచ్చు. అలాంటి అమ్మాయి.. ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. అది సినిమాల వలన కాదు అక్కినేని కుటుంబం వలన. ఈపాటికే ఆ అమ్మాయి ఎవరు.. ? ఆమెకు దక్కిన అదృష్టం.. ? ఏంటి అనేది తెలిసిపోయి ఉంటుంది. అవును.. ఆ తెనాలి అమ్మాయి శోభితా ధూళిపాళ్ల.  అక్కినేని నట వారసుడు అక్కినేని నాగచైతన్య.. సమంతతో విడిపోయాకా శోభితా డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

Shalini Ajith: 24 ఏళ్ల తరువాత తన రహస్య స్నేహితుడిని కలిసిన అజిత్ భార్య.. ఫోటో వైరల్


గూఢచారి, మేజర్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె ఈ డేటింగ్ వార్తలు బయటకు వచ్చాకా టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. చై వలన ఈ చిన్నదాని లక్ మొత్తం మారిపోయింది. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ మొత్తం అమ్మడి గురించే చర్చ. ఇక ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజం చేస్తూ ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ లో వీరి వివాహం ఘనంగా జరగనుంది. అక్కినేని కొత్త కోడలిగా శోభితా రేంజ్ మారిపోయింది.. స్టైల్ మారింది. బోల్డ్ బ్యూటీ కాస్తా హోమ్లీ బ్యూటీగా మారిపోయింది.

పెళ్లి తరువాత శోభితా అక్కినేని ఇంటి పేరును నిలబెట్టేలానే ఉంటుందని సమాచారం. అంటే.. సినిమాలను ఏరికోరి ఎంచుకుంటుందని టాక్. ఇక తాజాగా అక్కినేని కొత్త కోడలు..  ఏఎన్నార్ అవార్డ్స్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. గ్రీన్ కలర్ చీరలో ఆమె  రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కినేని కుటుంబం మొత్తం శోభితాను ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Mahesh Babu: కృష్ణుడిగా మహేష్ బాబు.. ఇదే కనుక నిజమైతే.. థియేటర్లే ఆలయాలు.. ?

అక్కినేని నాగేశ్వరావు బ్రతికి ఉన్నప్పుడే తన పేరు మీద సొంత డబ్బుతో ఇండస్ట్రీకి సేవ చేసే కళాకారులకు ఏఎన్నార్ నేషనల్ అవార్డును అందించడం మొదలుపెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు. ఆయన మరణించాకా.. ఆ బాధ్యతలను అక్కినేని కుటుంబం నెరవేరుస్తూ వస్తున్నారు.

ఈసారి ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. ఈ విషయాన్నీ ఈ మధ్యనే నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. నేడు ఈ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతుంది.  టాలీవుడ్ అతిరథ మహారథులు అందరూ ఈ వేడుకకు హాజరు అవుతున్నారు. ఇక ఎంతో అద్భుతమైన ఈ వేదికపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా ఏఎన్నార్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×