EPAPER

Rajamouli: ఆ షాట్స్ ని కాపీ కొడతాను.. గ్లోబల్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Rajamouli: ఆ షాట్స్ ని కాపీ కొడతాను.. గ్లోబల్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Rajamouli..దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) మొదట శాంతి నివాసం అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ గా తన కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దర్శకుడిగా సినిమాలలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ఒక కథను పట్టుకొని ఎంతో మంది హీరోలు చుట్టూ తిరిగిన ఈయనకు నిరాశే ఎదురయ్యింది. చివరికి ఎన్టీఆర్ (NTR) ధైర్యం చేసి ఆయనకు అవకాశం ఇవ్వగా.. మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి ,యమదొంగ ,ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఒక్క ఎన్టీఆర్ తోనే చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.


తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి..

ఇకపోతే రాజమౌళి చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పుడు గ్లోబల్ స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమా కూడా విభిన్నంగానే ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమాలంటే గ్లోబల్ స్టార్ డైరెక్టర్లు కూడా ఫిదా అయిపోతారు. అలాంటి ఈయన ఇప్పుడు తాను కూడా కాపీ కొట్టానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి సినీ ప్రస్థానం ఎలా సాగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 23 సంవత్సరాలలో కేవలం 12 సినిమాలు చేసి అపజయం ఎరుగని డైరెక్టర్ గా రికార్డు క్రియేట్ చేశారు.


హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొడతానన్న రాజమౌళి..

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఈయనకే సొంతం. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ ఊహించని విజయాలు అందుకుంటున్న రాజమౌళి తాను చేసే సినిమాలలో కొన్ని షాట్స్ కాపీ చేస్తాడని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేసినా.. అవి ఏ ఎక్కడినుంచి తీసుకున్నాడు అనే విషయం అర్థం కాక కొంతమంది సైలెంట్ అయిపోయేవారు. అయితే ఇప్పుడు మారిన అత్యాధునిక ప్రపంచంలో రాజమౌళి తన సినిమాలలో పెట్టే సన్నివేశాలను లేదా షాట్స్ ను ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది ఫ్రూఫ్స్ తో సహా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి కూడా నిజం ఒప్పుకున్నారు. తన సినిమాలలో కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాల నుంచి, ఇతర భాషా చిత్రాల నుంచి కాపీ చేస్తానని తెలిపారు.

వివరణ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి..

గత పది సంవత్సరాల క్రితమే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. దీనికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నతనం నుంచి మనపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎంతలా ఉందో అందరికీ తెలుసు. నా వరకు నేను మన సినిమాలు ఆస్థాయిలో ఎందుకు ఉండవు అని మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇక ఆ సినిమాల నుంచి కాపీ కొడతావు అనే మాటకు నా సమాధానం.. అవుననే చెబుతాను. హాలీవుడ్ సినిమాలలోని కొన్ని షాట్స్ ని డైరెక్ట్ గా కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను అంటూ ఒప్పుకున్నారు. ఏది ఏమైనా దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా కొన్ని సన్నివేశాలు కాపీ చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×