Mahesh Babu: టైటిల్ చూడగానే.. ఏంటి నిజమా.. ? అని అనుకుంటున్నారా.. ? ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్తల్లో ఇది కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వం ఈ సినిమా కోసం దేశం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే.. మహేష్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. మహేష్ బాబు శ్రీకృష్ణడుగా కనిపించనున్నాడట.
ఈ ఏడాది రిలీజ్ అయిన కల్కి సినిమాలో శ్రీకృష్ణుడిని చూసి ఆ పాత్రలో కనిపించింది మహేష్ బాబునే అని రూమర్స్ వచ్చాయి . సినిమా రిలీజ్ అయ్యాకా.. ఆ పాత్రలో నటించింది తమిళ నటుడు కెకె అని తెల్సింది. ఇక కల్కి 2 లో అయినా కృష్ణుడి పాత్రలో మహేష్ నటిస్తే బావుండు అని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. ఇక ఆ కోరిక నెరవేరబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం దేవకీ నందన వాసుదేవ. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండడం విశేషం.
Pawan Kalyan: విజయ్ పొలిటికల్ జర్నీ.. పవన్ కీలక వ్యాఖ్యలు
ఇక ఈ సినిమాల్లో అశోక్ గల్లా సరసన మాజీ మిస్ ఇండియా మానసి వారణాసి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ రిలీజ్ కానుంది. పెద్ద సినిమాలు అయిన కంగువ, మట్కాలతో పోటీపడడానికి రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు.
అయితే ఈ నేపథ్యంలోనే దేవకీ నందన వాసుదేవ సినిమాలో మహేష్.. శ్రీకృష్ణుడుగా కనిపించనున్నాడని అంటున్నారు. అయితే ముఖం చూపించకుండా కల్కిలో కృష్ణుడు ఎలా కనిపించాడో అలానే కనిపిస్తాడని చెప్పుకొస్తున్నారు. ప్రశాంత్ వర్మ.. ఈ పాత్రను ఎంతో పవర్ ఫుల్ గా రాసాడని టాక్. క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడి ఉగ్రస్వరూపం షాట్ ఉంటుందట.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ సూపర్ హిట్ మూవీని అస్సలు మిస్ చెయ్యకండి..
ఇక దీంతో దేవకీ నందన వాసుదేవ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో నిజముందా.. ? లేదా.. ? అని పక్కన పెడితే.. ఇదే కనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. మహేష్ థియేటర్ లో నీడగా కనిపించినా కూడా ఆ థియేటర్లను ఫ్యాన్స్ ఆలయాలుగా మార్చేస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇది నిజం అవుతుందేమో చూడాలి.