Bigg Boss 8 Day 57 Promo 2.. నిన్నటితో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఏడవ వారం మెహబూబ్ ఎలిమినేట్ అవ్వగా.. మరొకవైపు అనారోగ్య సమస్యల కారణంగా ముక్కు అవినాష్ కూడా సడెన్ గా ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే ఎనిమిదవ వారం మొదలైంది. ఎనిమిదవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి మాత్రం ఊహించని విధంగా మెగా చీఫ్ గా అవతారం ఎత్తిన విష్ణు ప్రియని మిగతా కంటెస్టెంట్స్ అంతా టార్గెట్ చేస్తూ.. ఆమె ప్రేమ విషయాన్ని తెర పైకి తీసుకొస్తూ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 57వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో నామినేషన్స్ ప్రక్రియ మొదలైనట్లు చూపిస్తూ విష్ణు ప్రియ ను టార్గెట్ చేసినట్టు చూపించారు.
ప్రోమోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఇప్పటి నుంచి వారాలు గడిచేకొద్దీ ఆట మరింత కఠిన తరం కాబోతోంది. మునుముందు సాగే ప్రయాణంలో ఈరోజు జరగబోయే మీ నామినేషన్ అత్యంత ముఖ్యమైనది. మెగా చీఫ్ విష్ణు ప్రియ.. ఈ ఇంట్లో వారి ప్రయాణాన్ని మరింత ముందుకు కొనసాగించడానికి అర్హతలేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి, ఒక్కొక్కరిని జైల్లో పెట్టి తాళం వేయండి అంటూ బిగ్ బాస్ చెప్పారు.
ఇక వెంటనే ఏదో పూనకాలు వచ్చినట్టు క్లాప్స్ కొడుతూ .. నవ్వుతూ రెచ్చిపోయింది విష్ణు ప్రియ. ఇది చూసిన నెటిజన్స్.. విష్ణుప్రియలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రోమో విషయానికొస్తే.. విష్ణు ప్రియా చప్పట్లు కొట్టగానే రాయల్ క్లాన్స్ సభ్యుడైన టేస్టీ తేజ మాట్లాడుతూ.. చప్పట్లు కొట్టిందిగా ఇక మనదే ఛాన్స్ అంటూ చెప్పాడు. విష్ణు ప్రియ ఆడవాళ్లు అనేవాళ్ళు అనే చెప్పగానే.. గౌతమ్ మాట్లాడుతూ.. ఇక ప్రతివారం ఇదే చెప్పి నన్ను నామినేట్ చేస్తున్నారు. నాకు ఒక క్లారిటీ కావాలి అంటూ అడగగా.. విష్ణు ప్రియ నాకూ ఒక క్లారిటీ రాలేదు గౌతమ్ అని చెప్పింది. టేస్టీ తేజ మాట్లాడుతూ.. సంచాలక్ గా అక్కడ కరెక్ట్ నిర్ణయం నువ్వు తీసుకోవాల్సింది అని చెప్పాము అంటూ తేజ తెలిపాడు.
గౌతమ్.. విష్ణు ప్రియ లవ్ విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ.. ఇక్కడ నాకంటే అన్ బ్యాలెన్స్డ్ పర్సన్ లేరు.. నాకంటే తక్కువ పని, నాకంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉన్నవాళ్లు నీ చుట్టూ ఉన్నా కూడా వాళ్లను నామినేట్ చేయవు అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో ఫైర్ అయిన విష్ణు ప్రియ ఎందుకు నువ్వు ఒకే వ్యక్తి గురించి ఉన్నాడు.. లేడు.. చెయ్యడు అంటూ పదేపదే అంటున్నావు అంటూ పృథ్వీ ను దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేసింది. ఆ తర్వాత మధ్యలో యష్మి.. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ పెట్టకు గౌతమ్ . ఆ తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేయగా.. అక్క నువ్వు ఆగు అంటూ యష్మికి జలక్ ఇచ్చాడు. ఆ తర్వాత యష్మి ఫైర్ అయిపోయి అక్క అని పిలవకు యష్మి అని పిలువు అంటూ రెచ్చిపోయింది. ఇక ఎట్టకేలకు గౌతమ్ ను విష్ణుప్రియ జైల్లో పెట్టి తాళం వేయగా.. పృథ్వీ నవ్వుతూ.. రెచ్చిపోతూ నీకు అసలు దమ్ము లేదు ఉంటే డైరెక్ట్ పేరు తీసి చెప్పొచ్చు కదా అని అన్నాడు. ఇక అలా ఇద్దరి మధ్య గొడవ జరిగేటట్టే కనిపిస్తోంది. అలాగే టేస్టీ తేజ కూడా నేనెవరు నీ గురించి చెప్పడానికి.. అసలు నీకేమవుతాను అంటూ కూడా ఫైర్ అయ్యాడు. ఇలా చాలా వరకు కూడా కంటెస్టెంట్స్ విష్ణు ప్రియ ప్రేమ వ్యవహారాన్ని తీస్తూ హౌస్ లో రచ్చ చేశారు.