EPAPER

Nayanatara: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న లేడీ సూపర్ స్టార్.. క్లారిటీ ఇదే..!

Nayanatara: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న లేడీ సూపర్ స్టార్.. క్లారిటీ ఇదే..!

Nayanatara.. దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanatara) తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం భాషలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. షారుఖ్ ఖాన్(Sharukh Khan) హీరోగా నటించిన జవాన్ (Jawan) చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్ లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే అక్కడ హిందీ ఆడియన్స్ ను కూడా మెప్పించింది నయనతార. ఇక లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కి తగ్గట్టుగానే ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది.


ప్లాస్టిక్ సర్జరీ పై నయన్ క్లారిటీ..

ఇదిలా ఉండగా తాజాగా గత కొద్ది రోజులుగా నయనతార.. తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. “నా కనుబొమలు అంటే నాకు ఎంతో ఇష్టం వాటి ఆకారం ఎప్పుడూ కూడా మారుస్తూనే ఉంటాను. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు వాటి షేప్ కచ్చితంగా మారుస్తాను. వాటికోసం ఎంతో సమయాన్ని కూడా నేను వెచ్చిస్తాను. కనుబొమల ఆకారం మారినప్పుడు నా ముఖంలో కూడా మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు కనిపించాయని ప్రజలు అనుకొని ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారు నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని కామెంట్స్ చేస్తున్నారు. నా ముఖంలో మార్పులు అనేవి ఒక కనుబొమల మార్పు ఒకటే కారణం కాదు.. నేను చేసే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరొకసారి అవి లోపలికి వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడవచ్చు.. నా శరీరంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండదు” అంటూ సరదాగా నయనతార చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తాను తన కనుబొమలు ప్రతిసారి మార్చడం వల్లే తన ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయని, అలాగే డైటింగ్ వల్ల కూడా మార్పులు కనిపించవచ్చు.. తాను మాత్రం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదంటూ.. ప్లాస్టిక్ సర్జరీ కామెంట్లపై క్లారిటీ ఇచ్చింది.


నయనతార సినిమాలు..

ఇక నయనతార విషయానికొస్తే.. 2003లో వచ్చిన మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే నయనతార ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఈమె నటించిన కొన్ని చిత్రాలలో ఆమె ముఖం మొదటి సినిమాల కంటే సన్నగా కనిపించింది. దీంతో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పటికీ కూడా ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వీటికి పులిస్టాప్ పెట్టింది నయనతార. ప్రస్తుతం తెలుగు, హిందీ , తమిళ్ భాషలలో నటిస్తున్న ఈమె గతేడాది మూడు సినిమాలతో అలరించి, ఇప్పుడు మరో ఐదు సినిమాలతో బిజీగా ఉంది. ఇక మరోవైపు ప్రముఖ డైరెక్టర్ ,తన అభిమాని విగ్నేష్ శివన్ (Vignesh Shivan ) ను ప్రేమించి వివాహం చేసుకున్న నయనతార ఇద్దరు మగ కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×