Janwada Farm House Case: జన్వాడ రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారా? ఈ కేసులో తీగ లాడితే డొంక కదులుతోందా? రేవ్ పార్టీ తర్వాత రాజ్ పాకాల ఎక్కడున్నారు? పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారా? అవుననే సంకేతాలు బలంగా వున్నాయి.
జన్వాడ రేవ్ పార్టీ వ్యవహారం కేటీఆర్ బావమదిరి రాజ్ పాకాల మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో మోకిల పోలీసులకు ఆయనకు నోటీసులు చేశారు. BNS 35 (3 ) సెక్షన్ ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో ప్రస్తావించారు పోలీసులు. ఈ రోజు తమ ముందు విచారణకు హాజరు కావాలన్నారు.
అడ్రస్ ప్రూఫ్‌తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరారు పోలీసులు. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. మోకిలా పీఎస్‌కు హాజరు కాకపోతే BNS 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు పోలీసులు. మరోవైపు పోలీసుల నోటీసు నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల. పార్టీ వ్యవహారంలో తనను పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా ప్రస్తావించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.
రాజ్ పాకాల కు మోకిలా పోలీసులు నోటీసులు..!
BNS 35 (3 ) సెక్షన్ ప్రకారం నోటీసు జారీ.
పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు.
ఈరోజు తమ ముందు విచారణకు హాజరు కావాలన్న పోలీసులు.
అడ్రస్ ప్రూఫ్ తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని… https://t.co/NglIFATGXP pic.twitter.com/EZ4PaEe5a9
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2024