Telangana Wife Kill Husband| మానవ సంబంధాలు కాదు.. డబ్బే ప్రధానం అన్నట్లు నేటి సమాజం మారిపోతోంది. అష్టఐశ్వర్యాలు ఇచ్చిన భర్తను ఓ భార్య కేవలం తన విలాసాల కోసం రూ.8 కోట్లు ఇవ్వలేదని హత్య చేసింది. ఈ ఘటన మరెక్కడో కాదు.. హైదరాబాద్ నగరంలోనే జరిగింది. అయితే హత్య చేసిన తరువాత భర్త మృతదేహాన్ని ఆమె చాలా చాకచక్యంగా తన మిత్రుడు, ప్రియుడితో కలిసి 800 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పడేసింది. అయినా దురదృష్టమో లేదో చేసుకున్న పాపమో ఆమెను తిరగి హైదరాబాద్ వరకు వెంటాడింది. పోలీసులు ఆమెను పసిగట్టేశారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఊరి చివర పోలీసులకు ఒక కాలిపోయిన శవం లభించింది. ఆ శవం పోస్టు మార్టం చేయడంతో.. హత్య రెండు వారాల క్రితం జరిగిందని.. చనిపోయిన వ్యక్తి ఒక 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పురుషుడని తెలిసింది. దీంతో పోలీసులు అయిదు రోజు క్రితం ఆ ప్రాంతంలో ఏం జరిగిందో సిసిటీవి వీడియోలు పరిశీలించారు. అయితే రాత్రి వేళ ఒక కారు రెండు సార్లు ఆ ప్రాంతంలో తిరిగినట్లు గమనించారు. కానీ చీకటి కావడంతో కారు నెంబర్ సరిగా కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ కారు ఏ దిశలో ప్రయానించిందో ఆ దారిలోని సిసిటీవి వీడియోలను పరిశీలిస్తూ వచ్చారు.
కారు టుమ్కూరు వైపు వెళుతుండగా.. అక్కడ టోల్ ప్లాజాలో కనిపించింది. ఆ కారు యజమాని హైదరాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ ది అని తెలిసింది. దీంతో పోలీసులు రమేష్ గురించి విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. కానీ రమేష్ కొన్ని రెండు వారాలుగా కనిపించడం లేదని.. అతని భార్య మిస్సింగ్ కేసు నమోదు చేసిందని తెలిసింది. అయితే ఆ కారు రమేష్ భార్య వద్దనే ఉందని తెలిసి పోలీసులు రమేష్ భార్య నిహారిక (29)కు అదుపులోకి తీసుకున్నారు. నిహారికనే తన భర్తు హత్య చేసిందని అనుమానించి పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. దీంతో నిహారిక నిజం చెప్పేసింది.
Also Read: కలెక్టర్ బంగ్లా పక్కన బిజినెస్‌మ్యాన్ భార్య శవం లభ్యం.. 4 నెలల క్రితం హత్య!
పోలీసుల కథనం ప్రకారం.. నిహారికకు 16 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రి చనిపోయాడు. తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే నిహారిక బాగా చదువుకొని.. ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఆమె 22 ఏళ్లకే వివాహం చేసుకుంది. కానీ భర్తతో విడాకులు తీసుకొంది. అయితే మొదటి భర్త వలన ఆమెను ఒక పాప కూడా ఉంది. ఆ తరువాత ఆమె రెండేళ్లు హర్యాణాలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ ఆ కంపెనీలో ఆర్థిక లావాదేవీల్లో మోసం చేసిందని ఆమెపై దొంగతనం కేసు పెట్టారు. ఈ కేసులో ఆమె కొంతకాలం జైల్లో శిక్ష అనుభవించింది. ఆ కాలంలోనే నిహారికకు అంకుర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి ఒక బడా వ్యాపారిని మోసం చేద్దామని ప్లాన్ వేశారు. అలా హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన రమేష్ అనే వ్యాపారి మొదటి భార్య చనిపోవడంతో అతడిని రెండో వివాహం చేసుకుంది.
రమేష్ వయసు 54, నిహారిక వయసు 29. వయసు వ్యత్యాసం కారణంగా నిహారిక తన భర్త ఆస్తిని మాత్రం కావాలనుకుని బయట నిఖిల్ అనే వెటరినరీ డాక్టర్‌తో ప్రేమాయాణం నడిపింది. నిహారిక అడిగినదంతా రమేష్ ఇచ్చేవాడు. కానీ నిహారిక ఒక రోజు తనకు రూ.8 కోట్లు కావాలని తాను ఒక బిజినెస్ చేస్తానని భర్తను అడిగింది. కానీ రూ.8 కోట్లు పెద్ద మొత్తం కావడంతో రమేష్ అంత తన వద్ద లేదని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. నిహారిక రోజూ ఒత్తిడి చేసేసరికి రమేష్ ఆమెకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. అప్పుడు నిహారిక.. తన పార్టనర్ అంకుర్ కు ఫోన్ చేసి తాము అనుకున్నట్లు రూ.8 కోట్లు రాబట్టలేమని.. పైగా రమేష్ విడాకుల బెదిరింపులు ఇచ్చాడని తెలిపింది.
అప్పుడు అంకుర్… ఇక రమేష్ ని హత్య చేస్తే.. అతని ఆస్తి మొత్తం నిహారికకే వస్తుందని ప్లాన్ చేశాడు. అలా ఒక రోజు రాత్రి రమేష్ ఇంటికి వచ్చినప్పుడు.. అంకుర్ అక్కడే ఉన్నాడు. నిహారికి, అంకుర్.. ఇద్దరూ కలిసి రమేష్ గొంతుకు తాడు బిగించి చంపేశారు. ఆ తరువాత శవాన్ని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. దీని కోసం నిహారిక లవర్ నిఖిల్ సాయం తీసుకున్నారు. నిఖిల్ తన ప్రియురాలి కోసం రమేష్ మృతదేహాన్ని కర్ణాటకలోని కొడగులో పడేద్దామని ప్లాన్ చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి కారులో శవం తీసుకొని బెంగుళూరు మీదుగా కొడగు వెళ్లారు. అక్కడ ఊరి బయట కాఫీ తోటలో అర్ధరాత్రి వేళ రమేష్ శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వచ్చారు.
కానీ వారి పాపం వారిని వెంటాడింది. పోలీసులు సీసీటీవిల ఆధారంగా వారిని గుర్తించి పట్టుకున్నారు. పోలీసులు రమేష్ హత్య కేసులో నిహారిక, అంకుర్, నిఖిల్ ముగ్గురినీ అరెస్టు చేశారు.