Coffee Powder For Hair: ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. తెల్లజుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇదిలా ఉంటే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు మార్కెట్‌లో లభించే హెయిర్ కలర్‌లను ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే కొన్ని రకాల హెయిర్ మాస్క్‌లతో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కాఫీ పౌడర్ కూడా ఉపయోగపడుతుంది. కాఫీ పౌడర్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలపడుతుంది, వాటి పెరుగుదల కూడా మెరుగుపడుతుంది . అంతే కాకుండా జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది. కాఫీ పౌడర్ జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కాఫీ పౌడర్ ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కాఫీ పౌడర్, పెరుగుతో హెయిర్ మాస్క్:
ఒక బౌల్ లో 2 టీస్పూన్ల కాఫీ పౌడర్ తీసుకుని దానికి 1 కప్పు పెరుగు లేదా అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి. 30-40 నిమిషాల తర్వాత మీరు వాడే పూతో తలస్నానం చేయండి. ఇలా తరుచుగా చేయడం ద్వారా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా మృదువుగా, మెరిసూ కనిపిస్తుంది.
కాఫీ పౌడర్‌ను సాధారణ నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టుకు మూలాల నుండి చివర్ల వరకు స్ప్రే చేసి మసాజ్ చేయండి. 15-20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
2.కాఫీ పౌడర్, తేనె స్క్రబ్:
ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీస్పూన్ కాఫీ పౌడర్, 1 టీస్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు నల్లగా మారుతుంది.
Also Read: నిద్రపోతున్నప్పుడు మీరు చేసే ఈ పొరపాట్ల వల్ల జుట్టు రాలుతుందని మీకు తెలుసా ?
3. కాఫీ పౌడర్, ఎగ్‌తో హెయిర్ మాస్క్:
ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, 1 ఎగ్ వైట్‌తో పాటు, కాస్త కొబ్బరి నూనెలో వేసి మిక్స్ చేయాలి. దీనిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఇల తరుచుగా చేయడం ద్వారా జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.
కాఫీ పౌడర్ యొక్క ప్రయోజనాలు:
కాఫీ పౌడర్ జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంతో పాటు మందంగా చేస్తుంది. అలాగే, శిరోజాలను శుభ్రంగా, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.