Srikanth Iyengar.. ప్రముఖ తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) తాజాగా పొట్టేల్ (Pottel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) రివ్యూ రైటర్ల పై విరుచుకుపడుతూ చేసిన కామెంట్లు జర్నలిస్టులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా అసభ్యకర పదజాలం వాడుతూ.. అసలు సినిమా ఏంటో తెలియని వాడు రివ్యూ రాసేస్తాడు అంటూ చాలా నీచంగా మాట్లాడారు. ఈ మాటలు విన్న సామాన్య ప్రేక్షకులు సైతం ఇతడి పై ఫైరయ్యారు. మీ సినిమా మొదలు పెట్టింది మొదలు విడుదల చేసి, కలెక్షన్లు వచ్చేవరకు మా రైటర్సే కదా.. మిమ్మల్ని పాపులారిటీ చేసే మా రైటర్స్ ను మీరు ఎలా అసభ్యకరంగా మాట్లాడగలిగారు అంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ఒక వీడియో వదులుతూ త్వరలోనే క్షమాపణలు కోరుతూ ఒక వీడియో విడుదల చేస్తాను అంటూ తెలిపారు.
దిగొచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్..
సినిమా రివ్యూ రాసే వారిపై శ్రీకాంత్ అయ్యంగార్ పరుష పదజాలం ఉపయోగిస్తూ సినిమా ఎలా రూపొందించాలో తెలియని నా కొడుకులంతా రివ్యూ ఇస్తున్నారు. సినిమా సమీక్షలు ఆపేయాలి అంటూ వ్యాఖ్యానించగా.. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మేరకు నటుడు వీడియో విడుదల చేస్తూ.. పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్ లో నేను కొన్ని మాటలు మాట్లాడాను. కొన్ని విషయాలలో ఇతరులకు బాధ కలిగించాను. అందరికీ కరెక్ట్ విషయాలపై త్వరలోనే క్షమాపణలు కూడా చెబుతాను. దయచేసి వేచి ఉండండి అంటూ ఒక వీడియో లో తెలుపుతూ వీడియో ని షేర్ చేశారు.
మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేసిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్..
ఇకపోతే పొట్టేల్ సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ.. మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొనింది కూడా..” ప్రసాద్ ల్యాబ్ లో శనివారం జరిగిన పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగార్ మీడియా గురించి చాలా దారుణంగా మాట్లాడారు. సినిమా రివ్యూలు రాసే వారిపై పరుష పదజాలం ఉపయోగించారు. ఆయన వ్యాఖ్యలను మీడియా తీవ్రంగా తప్పుపడుతోంది. శ్రీకాంత్ అయ్యగార్ మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయి. కాబట్టి ఆయనపై తగిన చర్యలు తీసుకోండి” అంటూ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తన ఫిర్యాదులో తెలిపింది.
నెటిజెన్స్ కామెంట్స్ వైరల్..
ఇకపోతే అసలు తప్పు తెలుసుకున్న శ్రీకాంత్ క్షమాపణలు చెబుతానని ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఇది చూసిన నెటిజన్స్.. మొన్న చాలా అసభ్యకర పదజాలం వాడుతూ జర్నలిస్ట్ లపై వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయావ్ కదా.. ఇప్పుడు మళ్లీ క్షమాపణలు చెబుతాను అంటూ వీడియో రిలీజ్ చేస్తున్నావ్ ఏంటీ.. మత్తు వదిలిందా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనా కొంతమంది సెలబ్రిటీలు ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఆ తరువాత క్షమాపణలు చెప్పడం కామన్ అయిపోయింది అని కొంతమంది ఎప్పటిలాగే కామెంట్లు చేస్తున్నారు.