Bigg Boss 8 Day 57 Promo1..బిగ్ బాస్.. ఒకే ఇంట్లో అసలు పరిచయం లేని వ్యక్తులతో, దాదాపు వంద రోజులకు పైగా ఉండాలి అంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. దీనికి తోడు మొబైల్ ఉండదు. సమయానికి సరైన ఆహారం దొరకదు. ఆహారం కావాలి అంటే కష్టపడాలి. టాస్క్ లు గెలిచి ఆహారం సంపాదించుకోవాలి. దీనికి తోడు టైం కూడా తెలియదు. ప్రపంచంతో అసలుకే సంబంధం ఉండదు. అలాంటి ఒక ఇంట్లో..అక్కడ ఉండే వ్యక్తులతోనే మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఆ ఇంట్లో ఉండే వారితోనే గొడవ వచ్చినా, సంతోషం వచ్చినా వారితోనే.. ఈ క్రమంలోనే ఒక్కొక్కసారి ఆ ఇంటి సభ్యులతో ఏర్పడే అనుబంధం, నిజంగా కుటుంబ సభ్యుల అనుబంధం కంటే కూడా ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి అనుబంధాలు అనూహ్యంగా ఆ ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా బయటకెళ్ళినప్పుడు బయటపడుతూ ఉంటాయి. అసలే ఎలిమినేషన్ అనగానే భయపడే కంటెంట్స్ ఊహించకుండా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అంటే ఇక ఆ బాధ ఎలా ఉంటుందో అవినాష్ ను చూస్తే అర్థమవుతుంది. ఆటలలో బెస్ట్ అనిపించుకున్నారు.. హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ని మెప్పించడంలో భేష్ గా నిరూపించుకున్నారు. అటు ఆడియన్స్ సపోర్టు కూడా ఎక్కువగా ఉంది. అలాంటి ఈయన సడన్ గా ఎలిమినేట్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య అవినాష్ బయటకొచ్చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఒక ప్రోమో ని మేకర్స్ విడుదల చేశారు.
8వ వారం ఎలిమినేషన్ లో భాగంగా మెహబూబ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ ఎలిమినేషన్ నుంచి ఇంకా కుటుంబ సభ్యులు తేరుకోకముందే అవినాష్ ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ప్రోమో విషయానికి వస్తే.. గత రెండు మూడు రోజులుగా ముక్కు అవినాష్ కడుపునొప్పితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఒక రూమ్ కి పంపించి డాక్టర్ సహాయంతో ఆయనకు చికిత్స చేయించారు. రిపోర్ట్స్ ఈరోజు రావడంతో.. అవినాష్ ను మళ్లీ పరీక్షించిన డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూపించి, మీరు హౌస్ లో ఉండకపోవడమే మంచిది బయటకు వచ్చేయండి అని సూచించారట.
ఇక విషయం తెలుసుకున్న ముక్కు అవినాష్ దిగాలుగా రోహిణి మరియు టేస్టీ తేజ తో ఈ విషయం చెప్పాడు. అయితే వీరు జోక్ చేస్తున్నాడని లైట్ తీసుకున్నారు. నిజంగానే వెళ్ళిపోతున్నాను రా అంటే.. ఆ మాకు తెలుసులే అంటూ నిర్లక్ష్యంగానే జోక్ చేస్తున్నాడని రోహిణి సమాధానం ఇవ్వగా.. ఆ సర్లే అంటూ ముక్కు అవినాష్ కూడా తెలిపాడు. ఇక తర్వాత సీరియస్ గా మరో కంటెస్టెంట్ అను మీద ఒట్టు వేయి అనగానే వెంటనే తాను అను మీద ఒట్టు వేశారు. దీంతో ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారు కంటెస్టెంట్స్. ఇక కంటెస్టెంట్ కన్నీటి ధారల మధ్య అవినాష్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరిని కంటతడి పెట్టిస్తోంది.