EPAPER

Vijay Devarakonda : చాలా చిన్న అమౌంట్ కి చెక్ ఇచ్చారు

Vijay Devarakonda : చాలా చిన్న అమౌంట్ కి చెక్ ఇచ్చారు

Vijay Devarakonda : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సెన్సేషన్ హీరోస్ లో విజయ్ దేవరకొండ పేరు మొదటి వినిపిస్తుంది. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. నాగ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రలో కనిపించాడు విజయ్. ఈ పాత్ర ఈ సినిమాకి ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంతా కూడా ఈ పాత్ర మీద నడుస్తుంది. ఇక్కడితో విజయ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు విజయ్. శేఖర్ కమ్ముల దగ్గర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి నాగి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అక్కడితో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అందుకనే ఇప్పటివరకు నాగి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ వచ్చాడు.


ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ఉన్నాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్ లో అర్జున్ రెడ్డి సినిమా అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలు కూడా మంచి పేరుని తీసుకొచ్చి విజయ్ ను నిలబెట్టాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది. కానీ ప్రస్తుతం విజయ్ చేస్తున్న ప్రతి ప్రాజెక్టు మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ 12వ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతుంది.సినిమా కూడా రెండు పార్ట్స్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.

ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో రిలీజిక్ సిద్ధంగా ఉన్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఫంక్షన్ లో యాంకర్ సుమ ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి విజయ్ ను అడిగారు. నేను ఫస్ట్ రెమ్యూనరేషన్ ఈటీవీ వాళ్ల దగ్గర తీసుకున్నాను వాళ్లకు ఒక సినిమాలో చేశాను వాళ్ళు నాకు చెక్ ఇచ్చారు. చాలా చిన్న అమౌంట్ అది చేతికిచ్చిన కూడా అయిపోతుంది కానీ వాళ్లకున్న అకౌంట్స్ వీటి వలన చెక్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ ఏ సినిమా చేశాడని అందరికీ ఒక డౌటు వచ్చి ఉండొచ్చు. రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తాడు విజయ్. ఆ సినిమాను ఈటీవీ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది బహుశా ఆ సినిమా కోసమే విజయ్ కి చెక్ ఇచ్చి ఉంటారు. ఇక చాలా చిన్న అమౌంట్ నుంచి మొదలైన విజయ్ ప్రస్థానం నేడు స్టార్ హీరో వరకు ఎదిగింది. ఇక ప్రస్తుతం విజయ డేట్స్ ఎంత బిజీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం కోట్ల రూపాయలలో ఉంటుంది. ఇదంతా కూడా విజయ్ సక్సెస్ కి నిదర్శనమని చెప్పాలి.


Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×