Intinti Ramayanam Today Episode October 28th : గత ఎపిసోడ్ లో.. ఆరాధ్యకు అక్షయ్ డ్రెస్ ని తీసుకొని వస్తాడు. డ్రెస్సు కరెక్ట్ గా సరిపోయింది కదా నీకోసమే తీసుకొచ్చాను బాగుందా అనేసి ఆరాధ్యను అడుగుతాడు. నానమ్మ తాత ఇలా పెళ్లిరోజు ఫంక్షన్ కదా అందుకు నీకోసం ఈ డ్రెస్ తీసుకున్నాను బాగుంది కదా అనేసి ఆరాధ్యను అక్షయ్ అంటాడు. ఎవరో వస్తే ఎలా చూస్తున్నారో అలా చూస్తున్నారనేసి అవని అక్షయ్ ని అడుగుతుంది. నా దగ్గర నువ్వు నిజం దాస్తున్నావు అదేంటో చెప్పు అనేసి అక్షయ్ గట్టిగా నిలదీస్తాడు. కానీ తల్లికి ఇచ్చిన మాట కోసం అవని నోరు మెదపకుండా ఉంటుంది. ఇక అవని దగ్గర రిసిప్ట్ ను తీసుకొని అక్కడకు వెళ్లి నగలను తీసుకొని వస్తుంది పల్లవి.. ఈ నగలతో రేపు ఫంక్షన్ లో అవనీని అడ్డంగా బుక్ చేస్తానని పల్లవి అనుకుంటుంది. ఇక కమల్ తన నైట్ డ్రెస్ ఎక్కడుందని పల్లవిని అడుగుతాడు. లో ఉన్న బ్యాగ్ ని చూసి ఏంది గిఫ్ట్ ఎవరి కోసం అనేసి అడిగితే అప్పుడు పల్లవి బావ అది అత్తయ్య వాళ్ళ కోసం అనేసి చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరూ రాజేంద్రప్రసాద్ కి ఆయన భార్యకు అర్ధరాత్రి వాళ్ళ రూమ్ కి వెళ్లి విషెస్ చెప్తారు. గెస్ట్ లు వస్తున్నారు మీరు రెడీ అవ్వండి అనేసి ఫంక్షన్ గురించి రివిల్ చేస్తారు. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఈరోజు ఫంక్షన్ ఉందని రాజేంద్ర ప్రసాద్ తో చెబుతారు. దానికి శ్రీకర్ శ్రీయాలను పిలుద్దాం అని అంటే రాజేంద్ర ప్రసాద్ వాడు వస్తే ఈ ఫంక్షన్ క్యాన్సిల్ చెయ్యండి అంటాడు. దానికి అందరు సైలెంట్ అవుతారు. వాడు వచ్చేటట్లు అయితే ఈ సెలెబ్రేషన్స్ ను ఆపేయ్యండి అంటారు. ఇక అందరు వెళ్ళిపోతారు..
అవని తన గదిలోకి వెళ్లి ఫంక్షన్ కి రెడీ అవ్వాలని ఒక చీరను తీసి పక్కన పెడుతుంది. నేను ఈ చీర తీసాను ఏంటి ఆయన నా కోసం రాత్రి తీసుకొచ్చిన చీర ఉంది కదా అది కట్టుకుంటాను అనేసి తనను తానే మాట్లాడుకుని ఆ చీరను తీసుకుంటుంది. అప్పుడే అక్షయ అక్కడికి వస్తాడు. మీరు నాకోసం తీసుకొచ్చిన చీరనే నేను కట్టుకుంటాను అనేసి అక్షయతో అవని అంటుంది. దానికి అక్షయ్ ఆ చీరను నీకు ఇవ్వమని చెప్పాను కదా అంటాడు. ఇది నా కోసం తీసుకొచ్చిన చీర మీరు నాకు ఇవ్వడమేంటి ఈ చీర నేను ఇవ్వను అనేసి కాసేపు ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటారు. ఇక అవని స్లిప్ అయ్యి పడిపోతుంటే అక్షయ్ పట్టుకుంటాడు. అప్పుడే ఆరాధ్య లోపలికి వస్తుంది. మీరిద్దరూ ఏం చేస్తున్నారని అడుగుతుంది. దానికి అవని మీ నాన్న తెచ్చిన చీరనే కట్టుకోమని చెప్తున్నాడు అదే కట్టుకుంటున్నాను ఆరాధ్య అనేసి అంటుంది. అవునా మమ్మీ ఈ డ్రెస్ కూడా నాకు డాడీనే తీసుకొచ్చాడు ఎలా ఉంది అనేసి అవనిని ఆరాధ్య అడుగుతుంది. మీ డాడీ సెలక్షన్లో పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు చాలా బాగుంది అంటుంది అవని. ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతా డు. అందరూ ఫంక్షన్ కి రెడీ అవుతుంటే పల్లవి మాత్రం సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
బాత్రూంలో నుంచి బయటికి వచ్చిన కమల్ పల్లవి పల్లవి అని అరుస్తాడు. నువ్వు నిన్న తన్నిన తనకి నాకు నడుము నొప్పి వస్తుంది నేను స్నానం చేయలేకున్నాను నువ్వు వచ్చి నాకు స్నానం చేయించాలి అని అడుగుతాడు .దానికి పల్లవి నేను బర్రెలకు స్నానం చేయలేదు నాకు చేయించడం రాదు అంటుంది. నేను బర్రె అయితే ఇంట్లో వాళ్ళని పిలిసి అందరితో అనిపిస్తాను. నేను బర్రె నా కాదా అనేసి కమల్ అరుస్తాడు అందరికీ తెలిసిపోతుందని పల్లవి కమల్ స్నానం చేయించేందుకు లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఫంక్షన్ కి అంతా రెడీ చేస్తూ ఉంటారు . గెస్టులు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. అవని రెడీ అయ్యి అక్షయ్ దగ్గరకు వస్తుంది .ఇది మీరు తెచ్చిన చీరనే ఎలా ఉందని అడుగుతుంది. కానీ అక్షయ్ మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అవని దగ్గరికి ఆరాధ్య వచ్చి మమ్మీ నువ్వు పిలుస్తున్న పలకట్లేదు ఏంటి నాన్న ఏమైంది అసలు అని అడుగుతుంది. దానికి అవని ఏదో ఒకటి సమాధానం చెప్తుంది. అప్పుడే చక్రధర్ రాజేశ్వరిలు వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకున్న అవని వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక వినోద్ ను తన భార్య ఎక్కడని రాజేశ్వరి అడుగుతుంది. దానికి వినోద్ అదే కనిపించట్లేదు కనిపించకపోతే టీవీ లో యాడ్ ఇద్దామని అనుకుంటున్నాను అంటాడు. ఇక పల్లవి మాత్రం ఫోన్ పట్టుకొని చాట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన రాజేశ్వరి పల్లవికి క్లాస్ పీకుతుంది. ఇది మీ ఇంట్లో ఫంక్షన్ ఇది నీ అత్తిళ్లు అనే సంగతి నువ్వు మర్చిపోవుతున్నావని పల్లవిని తిడుతుంది. అప్పుడే అవని వచ్చి వదిలేయ్ పిన్ని తెలియదు అనేసి రాజేశ్వరిని తీసుకెళ్తుంది. ఇక పల్లవి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.. ఇంట్లో ఫంక్షన్ జరగకుండా చేస్తానని చెప్పావు ఏం చేస్తున్నావ్ బేబీ అనేసి చక్రధర్ పల్లవి అని అడుగుతాడు. ఈ నగలు ఈ ఫంక్షన్ ని ఆపేస్తాయి డాడ్ అని పల్లవి అంటుంది. ఇవీ అవని నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది కానీ ఆ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని చక్రధర్ తో పల్లవి అంటుంది ఈ ఫంక్షన్ కి నా మనిషి ఒకడు వస్తున్నాడు.ఈ నగలను తీసుకొని వస్తాడు. వీటిని అవనినే ఇచ్చిందని చెప్తాడు ది గ్రేట్ రాజేంద్రప్రసాద్ గారి కోడలు తప్పు చేసింది అంటే అవమానంగా ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళు బాధపడతారు అనేసి చక్రధర్ పల్లవి సంతోష పడతారు ఇక ఫంక్షన్ గ్రాండ్ గా మొదలవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక రేపటి ఎపిసోడ్లో పల్లవి ప్లాన్ చేసినట్లు ఒక అతను వచ్చి నగలను కావాలనే కింద వేస్తాడు. అప్పుడు అక్షయ్ ఎవరు నువ్వు ఈ నగలు ఏంటి అనేసి అడుగుతాడు. నేను అవని ఫ్రెండుని ఈ నగలు నాకు అవన్నీ ఇచ్చింది తను పెట్టుకున్న నగలు గిల్టువని చెప్తాడు. పల్లవి నువ్వు పెట్టుకున్నవి నిజమైన నగలు అయితే ఇవ్వక్కా అనేసి అంటుంది. ఇక ఫంక్షన్ లో ఉన్న ఒక సేటు ఆ నగలు నిజమైనవా కాదా అని చెక్ చేస్తాడు. రేపటి ఎపిసోడ్ లో అవని గురించి నిజం తెలిసి పోతుందా?? లేక పల్లవి గర్భవతి అని అసలు నిజాన్ని అవని బయటపెడుతుందా?? చూడాలి..