Lokesh meets Tesla CFO: టెస్లా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇరువురు మధ్య దాదాపు మూడు లేదా నాలుగు గంటల సేపు పెట్టుబడులపై చర్చించినట్టు సమాచారం.
టెస్లా పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కార్ చర్చలు వేగవంతం చేస్తోంది. 2014-19 మధ్య కాలంలో టెస్లా కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆస్టిన్‌లోని టెస్లా కంపెనీ సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారు.
టెస్లా సీఎఫ్ఓ వైభవ్.. మంత్రి నారా లోకేష్ మధ్య మూడు నాలుగు గంటల సేపు పెట్టుబడులపై చర్చ జరిగింది. ఈవీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశమని చెప్పుకొచ్చారు మంత్రి. ఇప్పటికే ఆ ప్రాంతంలో కియో కార్ల కంపెనీ ఉందన్నారు. ఇటు బెంగుళూరు, అటు చెన్నైకి మధ్య ప్రాంతంగా ఉందని వివరించారు. అంతేకాదు కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉందన్నారు. దీనివల్ల ఎగుమతులకు దిగుమతులకు అనుకూలమైనది వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మా లక్ష్య సాధనకు టెస్లా వంటి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమన్నారు.
ALSO READ: ముగ్గురు అధికారులకు కీలక పోస్టింగులు.. అమ్రాపాలికి టూరిజం అథారిటీ సీఈఓ బాధ్యతలు
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలు రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఆయన దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా ఈవీ వాహనాల తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు కేరాఫ్‌గా మారనుందన్నారు. టెస్లా వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉందన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టి సారిస్తే సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్ చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించింది టెస్లా. ఏపీలో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.