EPAPER

Vijay devarakonda Speech: విజయ్ స్పీచ్ లో మీరు ఇది గమనించారా.?

Vijay devarakonda Speech: విజయ్ స్పీచ్ లో మీరు ఇది గమనించారా.?

Vijay devarakonda Speech : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రల్లో కనిపించి ఆ తరువాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచింది. అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అందులో సితార ఎంటర్టైన్స్ బ్యానర్ లో కూడా విజయ్ దేవరకొండకు అవకాశం వచ్చింది. కానీ ఆ బ్యానర్లు తన 12వ సినిమాను చేస్తున్నాడు విజయ్. విజయ్ కెరియర్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. అర్జున్ రెడ్డి అనే పాత్రలు విజయ్ తప్ప ఇంకెవరూ నటించలేరు అనే రేంజ్ లో ఆ సినిమాలో పర్ఫార్మ్ చేశాడు విజయ్. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో విజయ్ కనిపించిన ప్రతి చోట కూడా ఇంకా ఆ క్యారెక్టర్ లో ఉండిపోయాడు అనిపించే విధంగా ఉండేది.


ఇక విజయ్ స్పీచెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ప్రేక్షకు దేవుళ్ళు అని అభిమానులను పిలిచే తరుణంలో తన అభిమానులను అరే అనడం కూడా మొదలుపెట్టాడు. అయితే చాలామంది అభిమానులు దీనికి హర్ట్ అవకుండా వాళ్లు కూడా విజయని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో విజయ్ దేవరకొండ ఒక హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతున్నాయి. అయినా గాని విజయ్ మార్కెట్ ఇంకా దెబ్బ తినలేదు. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో అభిమానులు మైండ్ సెట్ కూడా బాగా మారిపోయింది. ఒక హీరోని ఇష్టపడితే ఆ హీరోకు డిజాస్టర్ సినిమాలు పడుతున్నాయి అని పక్కన పెట్టకుండా, ఆ హీరో హిట్ కొట్టేంతవరకు కూడా వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు.

ఇక విజయ్ స్పీచ్ మొదలు పెట్టినప్పుడు వాట్సప్ వాట్సప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవాడు. స్పీచ్ మొదలెట్టడంతోనే గట్టిగా అరుస్తూ ఇది మాట్లాడేవాడు. కానీ నిన్న జరిగిన లక్కీ భాస్కర్ ఈవెంట్ లో చాలా పద్ధతిగా అందరికీ నమస్కారం చెబుతూ అందరినీ రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడాడు. విజయ్ అలా మాట్లాడటం ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి. అయితే విజయ్ నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కానున్నాయి. హిట్ కొట్టేంతవరకు మనం కొంచెం తగ్గి మాట్లాడదాం అనే మైండ్ సెట్ ఏమైనా విజయ్ కు క్రియేట్ అయిందా.? లేదంటే అది విజయ్ సినిమా ఫంక్షన్ కాదు కాబట్టి అలా మాట్లాడాడు అనేది కొంతమంది చర్చించడం మొదలుపెట్టారు. అలానే రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను త్రివిక్ అనడం మొదలుపెట్టారు. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో వంశీ కూడా మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాసు ను త్రివిక్ అన్నారు. గురూజీ కాస్త త్రివిక్ అయ్యారా అని చాలామందికి సందేహాలు మొదలయ్యాయి. అయితే దీని గురించి మరికొన్ని ఫంక్షన్స్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Related News

Bail To Actor Darsan: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?

Jagapathi Babu: చిన్న కూతురికి అలాంటి సలహా.. షాక్ లో ఫ్యాన్స్..!

Salaar 2 Update : నిలిచిపోయిన సలార్ సీక్వెల్… ఫ్యాన్స్‌ను పిచ్చొళ్లను చేశారుగా…

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

×