Gundeninda GudiGantalu Today Episode 28th : గత ఎపిసోడ్ లో.. బార్ లో రాజేష్, బాలు ఇద్దరు కలిసి పీకలవరకు తాగేసి మాటలతో పంచులు పేలుస్తారు.. ఇక వీరిందరి డైలాగులు కామెడీగా ఉంటాయి.. ఎపిసోడ్ కు బాలు, రాజేష్ లు హైలెట్ అవుతారు. ఇక బాలు రాజేష్ ను లోపలికి వెళ్లమని చెబుతాడు. రాజేష్ తో నేను తాగి ఉన్నాను నువ్వు లోపలికి వెళ్లి బాలు కనిపించలేదని చెప్పు అంటాడు. కానీ రాజేష్ వెళ్తాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా ఇంటి దగ్గర రాజేష్, బాలుకు కౌంటర్ వేస్తాడు. నేను లోపలికి వెళ్ళను దాని మొహం చూడను, అందులోనూ నేను తాగున్నా నేను వెళ్లను అని బాలు అంటాడు. దానికి నువ్వు తాగి వచ్చావా మరి నేను పూజ చేసి వచ్చానా నేను కూడా తాగేసి వచ్చాను అంటాడు. అదే మీనాకు చెప్పు ఇద్దరం బార్ లో తాగాము తర్వాత బాధ పడుతూ ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పు అంటాడు. ఇక రాజేష్ వీరిద్దరి మధ్య పంచ్ డైలాగులు బాగా పేలాయి. ఇద్దరు కలిసి హిలరియస్ గా నవ్విస్తారు. ఇక రాజేష్ మీనా ఉందో లేదో కనుక్కోవాలని లోపలికి వెళ్తాడు.
ఇక మీనా ఇంటి తలుపు కొడతాడు.. మీనా తమ్ముడు తలుపు తీస్తాడు.. పిచ్చి పిచ్చిగా సమాధానం చెబుతాడు రాజేష్.. అప్పుడే మీనా వస్తుంది. అన్నయ్య మీరా ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. దానికి రాజేష్ బాలు తప్పిపోయాడని అబద్దం చెబుతాడు. దానికి బాలు టెన్షన్ పడతాడు. తర్వాత మీనా కనిపించడంతో బయటకు వెళ్ళిపోతారు. ఇక మీనా వచ్చి భారీ డైలాగులు కొడుతుంది. ఉదయం చావు అన్నారు ఇప్పుడు వచ్చారు. నా తప్పు లేదని అన్నా వినిపించుకోరే అని నమ్మిస్తుంది.. ఇక రాజేష్ తలతిక్క సమాధానం చెప్పడంతో మీ నాకు అర్థం అయిపోతుంది. బాలునే రాజేష్ ని ఇక్కడికి పంపించాడని తెలుసుకుంటుంది. బాలు ఎక్కడున్నాడో తెలియట్లేదు సిస్టర్ మీకు ఏమైనా తెలుసా అని అంటే అప్పుడు మీనా డ్రామాలు మొదలు పెడుతుంది. బాలు ఇక్కడికే వచ్చాడు అన్నయ్య ఇప్పుడే తినేసి ఫుల్లుగా పడుకున్నాడు అనేసి అడుగుతుంది. ఇక్కడికి వచ్చాడా పడుకున్నాడా సరే అమ్మ నేను వెళ్తాను ఇంకా అనేసి రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి మనోజ్ రోహిణి డిన్నర్ చేస్తూ ఉంటారు. మనోజ్ కి జాబ్ లేదన్న విషయం రోహిణికి చెప్పమని ప్రభావతి చెప్తుంది. ఇక సత్యం ను ప్రభావతి మీరు కూడా తినొచ్చు కదా అనేసి అడుగుతుంది. బాలు ఇంకా ఇంటికి రాలేదు బాలు వచ్చాక తింటాను అనేసి సత్యం అంటాడు. అప్పుడే బాలు ఫుల్లుగా తాగేసి ఇంట్లోకి వస్తాడు. మమ్మీ నువ్వు స్టడీగా ఉండు కింద పడిపోతావు అనేసి ప్రభావతి. బాలుని చూసిన సత్యం తాగి వచ్చావా అని అడుగుతాడు.
అది అడగనక్కర్లేదు నాన్నా చూస్తే తెలిసిపోతుంది.. అని మనోజ్ వచ్చి సత్యంతో అంటాడు. ముగ్గురు కొడుకులని కన్నాను. మీరు నాకు కోట్లు సంపాదించి పెట్టమని అడగలేదు మంచిగా ఉండాలని పరువు పోగొట్టుకున్న ఉండాలని కోరుకున్నాను అలాగే పెంచాను కూడా.. నువ్వు బాధపడకు నాన్న ఆ నల్ల బీమా గానికి నాలుగు తగిలించాను. ఇక నాలుగు రోజులు వాడు లేవడు అనేసి బాలు అంటాడు. రవి గాడు అమ్మాయితో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడాడు. ఇప్పుడు చేసిన పనికి ఇంట్లో పరువు పోయింది అని సత్యం అంటాడు. వీడు ఇలా తాగి వచ్చి రౌడీ లాగా గొడవలు పెట్టుకోవడం, వీడి భార్య ఇంట్లో వాళ్లకి పెళ్లి చేయడం ఇలాంటి వాటి వల్లే పరువు పోతుంది. అసలు ఆ రవి గాడు వల్ల బయట తలెత్తుకోలేకపోతున్నానని మనోజ్ అంటాడు. దానికి బాలు మర్యాదగా మాట్లాడు నీలాగా లేచిపోయి నీ ప్రియురాలికి 40 లక్షలు దోచిపెట్టమని అడగలేదు కదా అనేసి అంటాడు. అప్పుడు మనోజ్ బాలు మధ్య రచ్చ జరుగుతుంది . ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటారు. మధ్యలో వచ్చిన రోహిణి కూడా బాలు కొడతాడు. అప్పుడు సత్యం ఏంట్రా నువ్వు చేసింది. ఇలా నేను అలా నేను పెంచింది అనేసి ఎమోషనల్ అవుతాడు దాంతో హార్ట్ ఎటాక్ వస్తుంది . సత్యం ను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ బాలు ఏడుస్తూ ఉంటాడు . నాన్నతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక మీనా కలలో ఉలిక్కిపడి లేస్తుంది. రేపు ఉదయం వెళ్లి మీ మామయ్య గారికి జరిగిందంతా చెప్పు అని మీనాకు పార్వతీ చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో సత్యం కు హార్ట్ ఎటాక్ వచ్చిందని చాలా సివియర్ గా ఉందని డాక్టర్ చెప్తాడు . దాంతో అందరూ బాలుని తిడతారు. తాగొచ్చి ఇంటి మీదకు గొడవలు తీసుకొచ్చి ఎప్పుడు మనశాంతి లేకుండా చేసావని ప్రభావతి బాలును నోటికి వచ్చిన మాటలతో తిడుతుంది. ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా అప్పుడే హాస్పిటల్ కి వస్తుంది. ప్రభావతి మనోజ్ మీనా ను తిడతారు. ప్రభావతి మీ నాన్న కొట్టబోతుంటే రోహిణి అడ్డుపడుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..