EPAPER

Platform Ticket Restricted: ప్లాట్ ఫామ్ టికెట్ సేల్స్ పై ఆంక్షలు.. ముంబై తొక్కిసలాటతో రైల్వేశాఖ కీలక నిర్ణయం

Platform Ticket Restricted: ప్లాట్ ఫామ్ టికెట్ సేల్స్ పై ఆంక్షలు.. ముంబై తొక్కిసలాటతో రైల్వేశాఖ కీలక నిర్ణయం

Platform ticket restricted| ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా స్టేషన్ లో ట్రైన్ ఎక్కడానికి పరుగులు తీసిన ప్రయాణికుల వలన తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి కాళ్లు, వెనెముక, భుజాలు ఫ్రాక్చర్ అయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ముంబై నగరంలో పనిచేసే ఉత్తర్ ప్రదేశ్ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లాలనే కంగారులో సీటు సాధించేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన కారణంగా రైల్వేశాఖ ముంబై నగరంలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల విక్రయాలపై ఆంక్షలు విధించింది.


సెంట్రల్ రైల్వే.. ప్లాట్ ఫామ్ టికెట్ల విక్రయాలు దీపావళి పండుగ ముగిసేంతవరకు పరిమితి స్థాయిలో ఉండాలని ఆదివారం ఆదేశాలు జారిచేసింది. వెస్టరన్ రైల్వే పరిధిలోని బాంద్ర టర్మినస్ స్టేషన్ లో ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ వెళ్లవలసిన ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. 22 బోగీల ఆ ట్రైన్ మొత్తం జెనెరల్ కంపార్ట్‌మెంట్ కావడంతో సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడ్డారు. ఈ ఘటన జరిగిన కొంతసేపు తరువాతనే సెంట్రల్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Also Read:  దీపావళి రష్.. రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్రగాయాలు!


ఈ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల విక్రయాలపై ఆంక్షలు
రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటన తరువాత సెంట్రల్ రైల్వే కొన్ని బిజీ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల విక్రయాలపై ఆంక్షలు విధించింది. ఆ రైల్వే స్టేషన్ల జాబితాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మెనస్, దాదర్, కుర్లా ఎల్‌టిటి, థానె, కల్యాణ్, పుణె, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సెంట్రల్ రైల్వే ఆదేశాలు జారీ చేసిన తరువాత వెస్టరన్ రైల్వే కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8 వరకు ముంబై సెంట్రల్, దాదర్, బోరీవలి, వసై రోడ్, వాపి, సూరత్ స్టేషన్, వాల్‌సాడ్, బాంద్రా టర్మినస్, ఉధ్నా స్టేషన్లలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

రైల్వే శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. “ఈ ఆంక్షలు జనాల రద్ది తగ్గిండానికే.. రైల్వే స్టేషన్లలో దీపావళి, ఛత్ పూజా లాంటి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. స్టేషన్ రాకపోకలు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగులకు ఈ ఆంక్షలు వర్తించవు. ”

ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లే ట్రైన్లకు రద్దీ ఎక్కువగా ఉండడంతో రైల్వే శాఖ అదనపు ట్రైన్లు ప్రకటించింది.

మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్టోపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. “రైల్వే మంత్రి బుల్లెట్ ట్రైన్ల ధ్యాసలో పడి ముంబై ప్రయాణికులను పట్టింకోవడం మానేశారు. కేంద్ర ప్రభుత్వానికి ముంబై రైల్వే ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా.. ఇక్కడ వసతులు మెరుగుపరిచే ఆలోచనే వారికి లేదు. బుల్లెట్ ట్రైన్ తీసుకురావడంలో రైల్వే మంత్రి అశ్విని వైష్టో బిజీగా ఉన్నారు. ముంబైలో సామాన్య ప్రయాణికులు చనిపోతున్నా.. అది ఆయనకు పట్టదు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన చాలా చదువుకొని ఉన్నట్లు పోజులు కొడతారు. ఐఐటి నుంచి చదువుకున్నట్లు ప్రచారం చేసుకుంటారు. కానీ ప్రయాణాల కోసం రైల్వే పైనే ఆధారపడే సామాన్య ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన చేస్తున్నది ఏంటి? ” అని సంజయ్ రౌత్ ఘాటుగా విమర్శించారు.

Related News

India – China boarder issue : సరిహద్దులో చైనా స్నేహ హస్తం.. డ్రాగన్ కుయుక్తుల్ని నమ్మొచ్చా..?

NCB – Secret Meth Lab : దిల్లీలో డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుర్తింపు.. జైలు వార్డెనే అసలు సూత్రధారి

Threat To Abhinav Arora : పదేళ్ల పిల్లాడినీ వదలని లారెన్స్ బిష్ణోయ్.. ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పేంటీ?

Army Dog Phantom Dies: సైనికులను కాపాడి.. తన ప్రాణం విడిచింది.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ డాగ్ ఫాంటమ్ మరణం

Hoax Caller Arrested : విమానాలకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తు సంస్థల చేతికి చిక్కిన కీలక వ్యక్తి

Firecracker Explodes Kerala: కేరళ వేడుకల్లో విషాదం.. బాణసంచా పేలి 154 మంది గాయాలు, మరో

Thiruvananthapuram: తిరువనంతపురం.. సీఎం విజయన్‌కు తప్పిన ముప్పు

×