Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు ( gautam gambhir ) రోజులు తగ్గర పడ్డాయి. ఆయనపై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ దారుణంగా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆయనను కోచ్ పదవి నుంచే తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది. మొన్న పూణేలో టీమిండియా ఓటమిపాలైంది. పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో కంగుతుంది. స్వదేశంలో 12 సంవత్సరాల అనంతరం టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. మూడు మ్యాచుల సిరీస్ నువ్వు 0-2తో ఓడిపోయింది. భారత్ వరుస విజయాల జోరుకు కివీస్ బ్రేక్ వేసింది.
Also Read: Sri Lanka A vs Afghanistan A, Final: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఛాంపియన్ గా ఆఫ్ఘన్
స్వదేశంలో వరుసగా 18 సిరీస్ లు గెలిచిన టీమిండియాను ( Team India ) ఓడించిన లాథమ్ సేన చరిత్రను సృష్టించింది. బెంగళూరు ( Banguluru), పూణేలో ( Pune) వరుసగా మ్యాచులు గెలిచిన న్యూజిలాండ్ భారత్ లో తొలిసారి సిరీస్ ను కైవసం చేసుకుంది. అన్ని విభాగాల్లోనూ టీమిండియాపై కివీస్ పై చేయి సాధించింది. టాప్ క్లాస్ ఆటతీరుతో ఆతిథ్య జట్టును దెబ్బ కొట్టింది. రోహిత్ సేన బెంగుళూరు పూణే టెస్టులో ఓటమితో అభిమానులను నిరాశపరిచింది. ఐదు వికెట్లకు 198 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్ నిలకడగానే ఆడింది.
అయితే 41 పరుగులు చేసిన అనంతరం మరో ప్లేయర్ అవుట్ అయ్యాడు. ఈ దశలో ఫిలిప్స్ మాత్రం నిలబడ్డాడు. బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేశాడు. కానీ జడేజా, అశ్విన్ రాణించడంతో కివీస్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. 255 పరుగులకు ఉన్న లాథమ్ ( Latham) సేన ఆల్ అవుట్ అయింది. 48 పరుగులతో గ్లెన్ ఫిలిప్స్ నాట్ అవుట్ గా నిలిచాడు. భారత బౌలర్లను అత్యధికంగా వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
ALSO READ: IPL 2025: మరో 3 ఏళ్లు ఐపీఎల్ ఆడనున్న ధోని..ఇక ఫ్యాన్స్ కు పండగే?
359 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. 8 పరుగులు చేసి పెవీలియన్ కు చేరారు. ఈ దశలో గిల్ తో కలిసి జైస్వాల్ వేగంగా పరుగులు సాధించాడు. రెండో వికెట్ కు 62 పరుగులు జోడించిన తర్వాత గిల్ కూడా అవుట్ అయ్యాడు. గిల్ 23 పరుగులు చేశాడు. తన జోరును కొనసాగించిన యువ ఓపెనర్ జైస్వాల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే 77 పరుగులు చేసిన అనంతరం అవుట్ అయ్యాడు. ఈ సమయంలో కివీస్ బౌలర్లు దూకుడు చూపించారు. భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో టీమిండియా ఓడింది. అయితే.. టీమిండియా ఓడిపోవడానికి కారణం గంభీర్ ( gautam gambhir ) అని అంటున్నారు. టీ20 లాగా టెస్టులు ఆడేలా గంభీర్ ప్రేరేపించడంతో… టీమిండియా బ్యాటర్లు త్వరగా ఔట్ అవుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. అందుకే ఆయనను కోచ్ పదవి నుంచే తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది.