Janwada Farm House Rave Party: జన్వాడ రేవ్ పార్టీపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజ్ పాకాల కొకైన్ ఇస్తే తీసుకున్నట్లు విజయ్ పేరును ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు పోలీసులు. కానీ, విజయ్ వాదన మరోలా ఉంది.
నా పేరుతో సామాజిక మాధ్యమాలు మీడియాలో అనేక రకాల రూమర్లు వస్తున్నాయని వెల్లడించారాయన. మిత్రుడు రాజ్ పాకాల తమ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఆహ్వానించారని, ఫ్యామిలీతో సహా హాజరయ్యానని వివరించాడు.
అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని, పోలీసుల ఆరోపణలతో తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నానని మీడియా ముందు చెప్పుకొచ్చారు విజయ్. ఇది చాలా తప్పు, తన కుటుంబంతోపాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీ, బంధువులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు.
రెండున్నర దశాబ్దాలుగా మచ్చలేని కెరియర్‌ని కేవలం ఒక్క ఆరోపణతో మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తన పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టడం, అందులో డ్రగ్స్ గురించి ప్రస్తావించడం అంతా తప్పేనన్నారు. నా వాదన చాలా స్పష్టంగా చెప్పానని వివరించారు.
ALSO READ: రావు గారి రేవ్ పార్టీ ఫుటేజ్ డిలీట్.. నేషనల్ మీడియాలో చర్చ
తాను చెప్పని మాటలను ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారని తెలిపారు. తాను అమెరికన్ సిటిజెన్ మాత్రమే కాకుండా, ఇన్వెస్టర్‌గా అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తానని వెల్లడించారు. ఈ మధ్యనే తాను విదేశాలకు వెళ్లి వచ్చానని, అందుకు సంబందించి డీటేల్స్ చూపించానని తెలిపారు. తాను ఇండియాలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నది ఆయన వెర్షన్.