EPAPER

Vijay Madduri: జన్వాడ ఫామ్‌హౌస్‌ రేవ్‌ పార్టీపై విజయ్ ఫస్ట్ రియాక్షన్, ఫ్యామిలీతో ఫంక్షన్‌కు వచ్చా

Vijay Madduri: జన్వాడ ఫామ్‌హౌస్‌ రేవ్‌ పార్టీపై విజయ్ ఫస్ట్ రియాక్షన్, ఫ్యామిలీతో ఫంక్షన్‌కు వచ్చా

Vijay Madduri: జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ వ్యవహారం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌస్‌లో పార్టీ కలకలం రేపింది. ఈ ఇష్యూతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నేషనల్ మీడియా సైతం ఈ పార్టీ గురించి ఫోకస్ పెట్టడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో విజయ్‌ మద్దూరి అనే వ్యక్తి కొకైన్‌ తీసుకున్నట్లు అధికారులు నిర్థారించారు.


ఇక ఇదే విషయంపై విజయ్ మద్దూరి స్పందించారు. రాజ్‌పాకాల ఫాంహౌస్‌ రేవ్ పార్టీ కేసులో తనపై ఆరోణలు అన్నీ నిరాధారామన్నారు విజయ్ మద్దూరి. ఎఫ్ఐఆర్ పేరుతో చేస్తున్న ప్రచారం తప్పన్నారు. రాజ్‌పాకాల ఫాంహౌస్‌ కేసులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి మీడియాకి ఒక వీడియో విడుదల చేశారు. ఇండియాలో తాను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదన్నారు. తన మిత్రుడు రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్‌కి,దివాలీ పార్టీ కోసం ఆహ్వానించారని..కుటుంబంతో కలిసి హాజరయ్యానని ఆయన చెప్పారు. పోలీసులు చేస్తున్న ఆరోపణలతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నామంటూ వీడియోలో తెలిపారు. 25ఏళ్ల మచ్చలేని కెరియర్‌ను ఒక్క ఆరోపణతో మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు విజయ్ మద్దూరి.

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిందితుడు విజయ్ మద్దూరి మాటలతో అనుమానాలు నెలకొన్నాయి. తన బావమరిది ఇచ్చిన దావత్‌లో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని నిన్ననే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడేమో.. విజయ్ మద్దూరి తాను డ్రగ్స్ తీసుకోలేదని,  అంటున్నారు. నేనేం తప్పు చెయ్యలేదు.. కావాలనే నాపై కుట్ర చేస్తున్నారని అంటున్నారు. ఎవరు చెప్పేది నిజం? మోకిలా పోలీస్ స్టేషన్‌లో నిన్నంతా విచారణ ఎదుర్కొన్న విజయ్ మద్దూరి.. ఏమీ మాట్లాడకుండా కారులో వెళ్లిపోయారు. చాలాసేపటి తర్వాత వీడియో రికార్డ్ చేసి పంపారు. ఎవరి గైడెన్స్‌తోనైనా ఈ వర్షన్ వినిపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. తాను డ్రగ్స్ తీసుకోనప్పుడు ఆ విషయాన్ని మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గరే చెప్పొచ్చు కదా.. అన్నది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి  పోలీసుల ఎఫ్ఐఆర్‌లో తాను చెప్పని విషయాల్ని రాశారంటూ ఆరోపిస్తున్నారు.


Also Read: జస్ట్‌లో కేటీఆర్ మిస్.. ఎందుకు అమ్మాయిలకు టెస్ట్ చేయలేదు?

మరో వైపు.. కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల అజ్ఞాతంలోనే ఉన్నారు. పార్టీలో డ్రగ్స్ వ్యవహారం బయటకి వచ్చిన తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి లేకుండాపోయారు. పార్టీలో పాల్గొన్న విజయ్‌మద్దూరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులు చెబుతున్న దాంట్లో నిజం లేదంటున్నారు విజయ్ మద్దూరి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పార్టీలో జరగలేదన్నారు. రాజ్ పాకాల , ఆయన బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల్లో అనుమతి లేని విదేశీ మద్యం సీజ్ చేశారు.

Related News

Salvo industries : అనామక కంపెనీకి బడా టెండర్.. కథంతా నడిపించిన ఆ లీడర్

Congress : మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రె’ఢీ’

Janwada Farm House : సరే ఏం జరగలేదు.. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమా? – బీఆర్ఎస్ కు ఎంపీ అనిల్ కుమార్ సవాల్

CM Revanth Reddy: గృహ ప్రవేశాలు ఇలా కూడా చేస్తారా? తప్పేలేకుంటే ఎందుకు పారిపోయారు? కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. ఆ పథకం జనవరి నుండే ప్రారంభం.. ఇక వారికి పండగే!

KTR Tweet: ప్రత్యర్థి పార్టీలతో టీడీపీ కలిసింది.. అస్సలు నమ్మవద్దు.. గురి తప్పవద్దంటూ కేటీఆర్ సంచలన ట్వీట్

Bandi Sanjay – KTR: 7 రోజుల్లో సారీ చెప్పాలి.. రివర్స్ షాకిచ్చిన బండి సంజయ్.. కేటీఆర్ రిప్లై ఎలా ఉండెనో?

×