Bigg Boss Elimination: బుల్లి తెర పై టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదోవ వారం వీకెండ్ ఎపిసోడ్ ఎంత సరదాగా సాగిందో చూసాము.. నిన్నటి ఎపిసోడ్ లో దీపావళి సెలెబ్రేషన్ జరిగాయి. అంతేకాదు సెలెబ్రేటీలు సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చి సందడి చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే గత ఏడు వారాలు లేని విధంగా ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఎనిమిదో వారం నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు నిలవగా, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ వివిధ టాస్క్‌లలో సేఫ్ అయ్యారు. నయని, మెహబూబ్ లు మిగలగా మెహబూబ్ నామినేట్ అయ్యాడు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ వారం హౌస్ నుంచి మరొకరు బయటకు వచ్చేసారు.. అసలు కారణం ఏంటో ఈ సడెన్ షాక్ ఎందుకు ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం..
ఇక సెలెబ్రేటిల సందడి హోరేత్తించింది. ఆ తర్వాత ఫైర్ టాస్క్‌లో ఎలిమినేట్ అయిన మెహబూబ్‌కు నాగార్జున అతడి జర్నీని చూపించాడు. వరస్ట్ కంటెస్టెంట్ అని అవినాష్‌ను అవమానించినందుకు అతడికి మెహబూబ్ సారీ చెప్పాడు. హౌజ్‌మేట్స్‌కు కు ఒక్కొక్కరి గురించి చెబుతూ క్రాకర్స్ చెప్పాడు. అయితే పృథ్వీ ఎలిమినేట్ అవుతారని అందరు అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు.. ఆ తర్వాత స్టేజ్ మీద అతని బాండింగ్ గురించి చెప్పాడు. అలాగే దీపావళి కి రోజు నా ఎలిమినేషన్ ఉంటుందని ముందే గెస్ చేశా. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ప్రతి టాస్క్‌లో నా నుంచి వంద శాతం ఇవ్వడానికే కష్టపడ్డా. బెస్ట్ ఇద్దామనే వచ్చా. కానీ దురుదృష్టవశాత్తూ బయట వచ్చా అని మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు.. ఇక ఆ తర్వాత బయటకు వెళ్ళాడు. ఇక బిగ్ బాస్ లో మరో ట్విస్ట్.. మెహబూబ్ వెళ్ళగానే మళ్లీ అవినాష్ బయటకు వచ్చేసాడు.
అందరూ అతనే స్ట్రాంగ్ అని అనుకున్నారు కానీ అంతలోగా ఇలా షాక్ ఇచ్చాడేంటి అనే సందేహాలు మొదలయ్యాయి. అసలు కారణం ఏంటంటే.. బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్రోమోను చూపించారు. ఈ ప్రోమోలో కడుపు నొప్పేస్తుంది, వెళ్లిపోతాన ని అవినాష్ చెబుతూ కనిపించాడు. ఆవినాష్ కడుపునొప్పితో బాధపడుతోన్నట్లు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ కోసం అతడు బయట అడుగుపెట్టనున్నట్లు చెబుతోన్నారు. ట్రీట్‌మెంట్ పూర్తయిన తర్వాత తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడా? లేక ఇక ఇక్కడితో తన జర్నీ ముగిసిపోతుందా అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా అవినాష్ వల్ల బిగ్ బాస్ కు క్రేజ్ పెరిగింది. కానీ ఇప్పుడు అతను వెళ్లిపోవడంతో ఇక మళ్లీ డల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. సడెన్ గా ఇలా అవినాష్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి? ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ కాదు కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి..