EPAPER

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Snake in Train: రన్నింగ్ ట్రైన్ లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ లో పాము

సికింద్రాబాద్ నుంచి గోవాకు బయల్దేరిన సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్  జార్ఖండ్ వరకు వెళ్లింది. ఏసీ 2 టైర్ కోచ్ లో బెర్త్ మీద ఏదో కదులుతున్నట్లు ప్రయాణీకులు గుర్తించారు. ఏంటా అని బెడ్ షీట్ పక్కకు తీసి చూసే సరికి పాము కనిపించింది. ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. పక్క కోచ్ లోకి పరుగులు తీశారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పారు. నెక్ట్స్ స్టాఫ్ లో రైలును ఆపి, పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు పామును బెడ్ షీట్ లోనే పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆ పామును బయట వదిలేశాడు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదన్నారు. రైల్లోకి పాము ఎలా వచ్చింది అనే విషయంపై విచారణ జరుపుతామన్నారు. రైల్లో పాముకు సంబంధించి ఓ ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది. కొత్తగా ప్రారంభించిన రైల్లోకి పాములు దూరడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.


 

View this post on Instagram

 

A post shared by Lokmat Times (@lokmattimesmedia)

అక్టోబర్ 6న సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ప్రారంభం

సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు ఈ మధ్యే సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించింది. అక్టోబర్ 6న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నుంచి వాస్కోడిగామా స్టేషన్ కు వెళ్లే రైలు 17039 నంబర్‌ తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.  ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్ కు 17040 నంబర్‌ తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు  ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉన్నాయి.

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, గద్వాల్, కర్నూలు,  డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాసిల్‌ రాక్‌, కులెం, సాన్వోర్‌ డెమ్, మడగావ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: సీనియర్ సిటిజెన్లకు రైళ్లలో స్పెషల్ స్పెసిలిటీస్, ఇంతకీ అవేంటో తెలుసా?

Related News

Scenic Train Journey India: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!

Gold Rate Today: పండగ వేళ బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే..

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర

Richest People In World 2024: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే, ఒక్కొక్కరి ఆస్తుల విలువెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Cable TV Price Hike: మొబైల రిచార్జ్ పెంపు తర్వాత ఇక కేబుల్ టీవి ధరలు పైపైకి.. సామాన్యుడిపై మరింత భారం!

Flipkart Youtube Shopping: ఇక యూట్యూబ్ నుంచి ఫ్లిప్ కార్ట్, మింత్ర షాపింగ్.. కంటెంట్ క్రియేటర్లకు జాక్‌పాట్

×