trinayani serial today Episode: తిలొత్తమ్మ అందరికీ గాయత్రిదేవి చెప్పిన విషయాలు మొత్తం చెప్తుంది. రేపే ఆవిడకు ప్రాణగండం కూడా ఉందట అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అయితే రేపు గాయత్రి పాపను గుడికి తీసుకెళ్లకపోతే సరిపోతుందని అంటుంది హాసిని. అమ్మపేరు గల గాయత్రి రాకపోతే కీడు జరగదు అనుకుంటుంది వదిన అంటాడు విశాల్. ఇంతలో రేపు పాపను.. ఈ బొమ్మను తీసుకుని వెళ్లాలి అంది గాయత్రి అమ్మ అని చెప్తుంది నయని.
టెర్రస్ లో ఆలోచిస్తున్న తిలొత్తమ్మ దగ్గరకు వల్లభ వస్తాడు. బొమ్మను గాయత్రి పాపను గుడికి వెళ్లమన్న గాయత్రి అక్క అక్కడకు పాపగా వస్తుంది కదా? అందుకే ఆ బొమ్మను మనం వాడుకోవాలి అని చెప్తుంది తిలొత్తమ్మ. అప్పుడే మనం ఈ ప్రపంచం కూడా నయనిని మర్చిపోయేలా చేయాలంటుంది. ఈ పండుగకు బోనస్ గా గాయత్రి అక్క పునర్జన్మ రూపాన్ని.. నయనిని చంపేయాలని అని చెప్తుంది. ఆ బొమ్మను రాత్రికి కొట్టేసి నా దగ్గరకు తీసుకురా.. అని చెప్తుంది తిలొత్తమ్మ సరే.. బ్రహ్మ రాసిన రాతలో ఏముంటుందో కానీ నువ్వైతే బొమ్మతో మర్డర్ చేయబోతున్నావు సూపర్ అంటాడు వల్లభ.
సుమన, విక్రాంత్‌ను పట్టుకుని బయటకు తీసుకెళ్తుంది. ఎందుకు బయటకు తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు విక్రాంత్. మీ పెద్దమ్మ మా అక్కకు బొమ్మను ఇచ్చింది కదా? దానికి వెనకాల జిప్పు కానీ ఏదైనా ఉందో తాళం ఏమైనా ఉందో చూసి జాగ్రత్తగా ఓపెన్ చేయమని చెప్తుంది. ఎందుకు చూడాలని విక్రాంత్ అడగ్గానే.. అందులో ఏదో విలువైనది పెట్టి ఇచ్చిందేమోనని నాకు డౌటుగా ఉందని సుమన చెప్తుంది. దీంతో విసుగ్గా అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ అందులో విలువైనవి ఎందుకు ఇస్తారు అంటాడు విక్రాంత్.
చూడండి.. మీ పెద్దమ్మ మహా మేధావి.. మా అక్క తెలివైనది.. ఇద్దరూ ఒక పని చేశారు అంటే దాని వెనక ఏదో ఒక లాజిక్ ఉంటుంది అని సుమన చెప్పగానే.. ఇదేదో మాట్లాడుంతుంది అనుకుంటున్నాను కానీ ఈరోజు దాదాపు అన్ని కరెక్టుగానే మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటాడు. ఇంతలో సుమన నా ముఖం చూసి మాట్లాడకుండా.. ఆ బొమ్మను తీసుకుని చూడమంటున్నాను అంటుంది సుమన. దీంతో ఇక ఆపు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంటూ సీరియస్ అవ్వగానే మీరు ఇలా తేలిగ్గా తీసుకోండి ఈలోపు ఆ బొమ్మను ఎవరో ఒకరు తీసుకుంటారు అని వెళ్లిపోతుంది. బొమ్మ సంగతి ఏమో కానీ ఇది నా ఖర్మకు తగులుకుంది అనుకుంటాడు వల్లభ.
బొమ్మను నెత్తిన పెట్టుకుని వల్లభ ఒక్కడే పాట పాడుతూ డాన్స్ చేస్తుంటాడు. ఇంతలో కరెంట్ పోతుంది. వల్లభ భయంగా మమ్మీ ఎక్కడున్నావు అంటూ అక్కడున్నావా? అంటూ తిలొత్తమ్మ దగ్గరకు వెళ్తాడు. బొమ్మను చూసి ఇద్దరూ హ్యాపీగా డాన్స్ చేస్తుంటే.. గాయత్రి దేవి వచ్చి తిలొత్తమ్మను కొడుతుంది. ఇంతలో కరెంట్ వస్తుంది. తిలొత్తమ్మ వెళ్లి హాసిని మీద పడుతుంది. హాసిని వెటకారంగా ఏంటత్తయ్యా ఈ సరసాలు అంటూ పక్కకు తోసేస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. ఏమైంది అని అడుగుతారు. పెద్దమ్మ వచ్చిందట అని వల్లభ భయపడుతూ చెప్తాడు.
విశాల్ అమ్మ వచ్చిందా….? అని అడుగుతాడు. అవునని ఇక్కడే ఉన్నారని నయని చెప్తుంది. మీరేం చేశారో ఏమో అందుకే వచ్చి ఉంటారని నయని అంటుంది. పిచ్చి పని చేసింది నయని అని గాయత్రిదేవి చెప్తుంది. నీకిచ్చిన బొమ్మను ఒకసారి చూద్దామని తీసుకున్నామని చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో గాయత్రి దేవి తిలొత్తమ్మను ఇటు రమ్మను నయని అంటూ పిలుస్తుంది. దీంతో నయని అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్తుంది. దీంతో బొమ్మ తీసుకున్నందుకు ఇలా చావ కొట్టాలా..? అని ప్రశ్నిస్తుంది. మరి వదినకు ఇచ్చిన బొమ్మను తీసుకోవాలా..? మరీ చిన్నపిల్లల్లా చేస్తున్నారు అంటాడు విక్రాంత్.
ఇంతలో మీరు ఆలోచిస్తూనే ఉండండి తెల్లారిపోతుంది. గుడికి కూడా వెళ్లిపోతాము. అప్పుడు కూడా ఇంకా ఐడియా తట్టలేదు అంటారా.? ఏదైనా సరే ఆపద ఏ రూపంలో వస్తుందో నాకు తెలిస్తే సరి అంటుంది నయని. దీంతో చాన్సెన్స్ తక్కువ అయ్యయేమో వేరే ఎవరికైనా ఆపద వస్తుందంటే నువ్వు ముందే పసిగట్టే దానికి అంటాడు విశాల్. ఇంతలో గాయత్రిదేవి.. నయనికి జాగ్రత్త అంటూ రేపు వచ్చే ఆపదను నువ్వు చూడలేవని.. కానీ నా పునర్జన్మను చూస్తావు అని చెప్పి వెళ్లిపోతుంది.
గార్డెన్‌లో కూర్చున్న విశాల్ ను చూసి చాలా ప్రశాంతంగా కూర్చున్నారు మీ ముఖంలో చిరునవ్వును చూస్తుంటే తెలుస్తుంది అని అడుగుతుంది నయని. నా పరిస్థితి ఎలా ఉందో ఎలా చెప్పుకోవాలో తెలియక స్మైల్ ఇస్తున్నాను నయని అని మనసులో అనుకుంటాడు. ఏం మాట్లాడటం లేదు బాబు గారు అని అడుగుతుంది నయని. ఏం చెప్పాలో తెలియడం లేదు నయని అంటాడు విశాల్. దీంతో ఎప్పుడు తెల్లారుతుందా..? మన పెద్ద కూతురుని ఎప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నారు కదా? అంటుంది నయని అవునని విశాల్ చెప్తాడు. రేపు నిజంగా అమ్మ పసిపాపలా కనిపిస్తుంది అంటావా? అని విశాల్ అడుగుతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.