Bigg Boss 8 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సండే ఫన్ డే ఎపిసోడ్ పూర్తి అయ్యింది. ఈ వారం సెలెబ్రేటిల సందడి ఎక్కువగానే ఉంది. దీపావళి సందర్బంగా మూవీ ప్రమోషన్స్ కోసం సినిమాల టీమ్స్ హౌస్ లో సందడి చేశారు. మూడున్నర గంటల పాటు ఈ ఎపిసోడ్ సాగింది. ఇందులో దీపావళి సినిమాల ప్రమోషన్స్ జరిగాయి. కంగువా, క, లక్క భాస్కర్, అమరన్ టీంలు సందడి చేశాయి. వీరు కాకుండా అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్, సమీరా భరద్వాజ్ పాటలు, హైపర్ ఆది సెగ్మెంట్ ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి.. ఇక మూడోవారం ఎలిమినేషన్ అనుకున్నట్లు గానే మెహబూబ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇంతకీ అతను మూడు వారాలు హౌస్ లో కొనసాగినందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అనేది ఆసక్తిగా మారింది. మరి అతను సంపాదించాడో ఒకసారి తెలుసుకుందాం..
నామినేషన్ లో చివరకు నయని పావని, మెహబూబ్ నిలిచారు. నయని పావని సేఫ్ అయ్యింది. చివరగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. స్టేజ్ మీదకు వచ్చిన మెహబూబ్ ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దీపావళి కాబట్టి.. క్రాకర్స్‌తో కంటెస్టెంట్లను పోల్చమన్నాడు. అలా తనకు నచ్చిన ఐదుగురు కంటెస్టెంట్ల గురించి చెప్పుకొచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉందని చెప్పాడు. అవినాష్ ను పొగడ్తలతో ముంచేసాడు. ఇక అలా చెప్పిన తర్వాత హౌస్ ను బాధతో వీడాడు.. అయితే మెహబూబ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ ఎంత సంపాదించాడో అన్నది ఆసక్తిగా మారింది.. ఆ వివరాలాల గురించి ఇప్పుడు చూద్దాం..
మెహబూబ్ మూడు వారాలకు దిల్ సే రోజుకు సుమారుగా రూ. 42,857 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. అంటే, ఈ లెక్కన మెహబూబ్ ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 9 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.. ఆ తర్వాత అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నా.. అంటూ మెహబూబ్ బాధపడ్డాడు. ఇక ఈ తొమ్మిదో వారం నామినేషన్స్ ఎలా జరుగుతాయి.. ఎవరు నామినేట్ అవుతారు.. ఎలాంటి టాస్కులు పెడతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.. ఇక సోమవారం, మంగళవారం ఎపిసోడ్ లలో నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. నాగార్జున తో పాటుగా ఆది చెప్పిన మాటలు ఎంతమందిని మాయారుస్తాయ్ తెలియాలంటే రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి..