Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. ఆ రెండిటిలో పాత కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయారు. కానీ మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ బయటికి వచ్చేశాడు. తనే మెహబూబ్ దిల్‌సే. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత మెహబూబ్ లైఫే మారిపోయింది. కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. అలాంటి తనకు బిగ్ బాస్ 8తో మరో అవకాశం లభించింది. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు కానీ తను చేసిన కొన్ని తప్పుల వల్ల ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది.
అదే కారణం
బిగ్ బాస్ 8లో మెహబూబ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు. ఫిజికల్ టాస్కుల్లో రాయల్స్ టీమ్‌ను ముందుకు నడిపించే లీడర్ అయ్యాడు. రాయల్స్ నుండి మొదటి మెగా చీఫ్ అయిన ఘనత మెహబూబ్‌కే దక్కుతుంది. అలాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంకా చాలారోజులు హౌస్‌లోనే ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు తన సొంత తప్పుల వల్లే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా మెహబూబ్ మాట్లాడిన కమ్యూనిటీ మాటలు చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే అదే వారమే తను ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తన ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం అదే అయ్యిండొచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: నమ్మి మోసపోయిన విష్ణు ప్రియ.. నరకం చూపిస్తున్నారుగా..?
కమ్యూనిటీ మాటల ఎఫెక్ట్
బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత నబీల్‌తో కలిసి ఇతర కంటెస్టెంట్స్‌కు తెలియకుండా ఒక డిస్కషన్ పెట్టాడు మెహబూబ్. అదే ఇప్పుడు తను హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణంగా మారింది. నబీల్‌కు, తనకు తమ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందని, వారి ఓట్లు తమకే పడతాయని వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ నామినేషన్స్‌లో ఇద్దరూ ఉంటే కమ్యూనిటీ ఓట్లు చీలిపోతాయని అన్నాడు. ఈ మాటలు చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు. దీనిపై నాగార్జున అయినా సీరియస్‌గా స్పందిస్తారేమో అనుకుంటే అది కూడా జరగలేదు. అందుకే ఆడియన్సే ఇక తనను ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు.
గంగవ్వ ఎమోషనల్
మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్లేముందు కొందరు కంటెస్టెంట్స్ గురించి గొప్పగా మాట్లాడాడు. ముందుగా అవినాష్ గురించి చెప్తూ.. తనొక 1000 వాలా అని, తను వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్మెంట్ వచ్చిందని ప్రశంసించాడు. గంగవ్వను లక్ష్మి బాంబ్‌తో పోలుస్తూ బయటికి వచ్చిన తర్వాత తనకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని మాటిచ్చాడు. అందుకే గంగవ్వ చాలా ఎమోషనల్ అయ్యింది. నబీల్ రాకెట్‌లాంటి వాడని దూసుకుపోయే లక్షణం ఉందని అన్నాడు. రోహిణి, అవినాష్.. ఇద్దరూ ఉంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటామని చెప్పుకొచ్చాడు మెహబూబ్. ఇక గౌతమ్‌లో చాలా ఫైర్ ఉందని, దానిని బయటికి తీసుకొని రమ్మని సలహా ఇచ్చాడు.