EPAPER
Kirrak Couples Episode 1

IT Raids : హైదరాబాద్ లో మళ్లీ ఐటీ రైడ్స్.. ఎక్సెల్‌ గ్రూప్‌ సంస్థల్లో సోదాలు..

IT Raids : హైదరాబాద్ లో మళ్లీ ఐటీ రైడ్స్.. ఎక్సెల్‌ గ్రూప్‌ సంస్థల్లో సోదాలు..

IT Raids : హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. నగరంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుమారు 60 మంది ఐటీ సిబ్బంది 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. 40 కార్లు,3 సీఆర్పీఎఫ్ వాహనాల్లో ఐటీ బృందాలు వెళ్లాయి. ప్రధానంగా ఎక్సెల్‌ గ్రూప్‌ సంస్థల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్రా, ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూపు కంపెనీలను ఎక్సెల్‌ సంస్థ నడుపుతోంది. గచ్చిబౌలిలోని ఎక్సెల్‌ కార్యాలయంతోపాటు బాచుపల్లి, చందానగర్‌, బొల్లారం ప్రాంతాల్లో ఆ కంపెనీ అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన పత్రాలు పరిశీలిస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో తేడాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.


సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలోని ఎక్సెల్ రబ్బర్ పరిశ్రమలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని రెండు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ యూనిట్ -5తోపాటు విలాస్ పోలిమేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారుల కంపెనీ రికార్డులను పరిశీలిస్తున్నారు. లోనికి ఎవరినీ అనుమతించటంలేదని సమాచారం.

ఎక్సెల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఐటీ దాడులు ఇంకా అనేక చోట్ల కొనసాగుతున్నాయి. ఆ కంపెనీ ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.


కొన్నిరోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన విద్యా, వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేశారు. మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఇటీవల మైత్రీమూవీ మేకర్స్ కార్యాలయాలు , నిర్మాతలు యలమంచిలి రవి, నవీన్‌ ఏర్నేని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సంస్థ టాలీవుడ్ అగ్రహీరోలతో భారీ మూవీస్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఎక్సెల్ గ్రూప్ సంస్థల్లో ఐటీ దాడులు చేయడం కలకలం రేపుతోంది.

Related News

Hyderabad Real Boom: రివర్ వ్యూ.. లేక్ వ్యూ.. తేడా వస్తే ‘రోడ్ వ్యూ’.. ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×