Trivikram about Vijay Devarakonda : త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్స్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో చాలామంది కూడా త్రివిక్రమ్ స్పీచ్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. త్రివిక్రమ్ ఏ స్పీచ్ ఇచ్చినా కూడా అందులో నేర్చుకోవడానికి ఒక కొత్త రకమైన విషయాన్ని చెబుతూ ఉంటారు. అలానే ఒక వ్యక్తి గురించి మాట్లాడినా కూడా పుస్తకాలలోని కొన్ని మాటలు ఉదాహరణగా చెబుతూ ఉంటారు. అందుకనే త్రివిక్రమ్ స్పీచెస్ ను చాలా మంది యూత్ చూడడానికి ఇష్టపడతారు. ఒక ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నారు అంటే అక్కడ త్రివిక్రమ్ ఏం మాట్లాడుతారు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు. ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్ (Lucky Bhasker). ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి కానుక రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను నాగ వంశీ (Naga Vamsi) నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న అనుసంధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మితమయ్యే ప్రతి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందుకే లక్కీ భాస్కర్ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకే చీఫ్ గెస్ట్ గా కూడా హాజరయ్యారు. ఇక ఈవెంట్లో లక్కీ భాస్కర్ సినిమా తాను ఆల్రెడీ చూసేసారు కాబట్టి పేరుపేరునా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడి వాళ్లను అప్రిషియేట్ చేశారు. కొంతమంది పేర్లు తెలియని వాళ్లకు కూడా క్షమాపణలు చెప్పి వాళ్లను పొగిడితే వచ్చారు.
ఇక త్రివిక్రమ్ స్పీచ్ చివర్లో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ యాక్టర్. విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో ఎంతో ప్రేమను చూశాడు. అలానే అంతకు మించిన ద్వేషాన్ని కూడా చూశాడు. విజయ్ దేవరకొండ చాలా గట్టివాడు. అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఒక మాటను రాస్తారు “మావాడు మహా గట్టివాడు” ఆ మాటలు ఉదాహరణగా తీసుకుంటూ మావోడు చాలా గట్టి వాడే అంటూ భుజంపై చేతులేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ మరీ మాట్లాడాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ దేవరకొండ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లో తన 12వ (Vd12) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టూ పార్ట్స్ లో రానుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 100 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు.