EPAPER

Thalapathi Vijay Speech : పీక్ లో ఉన్న కెరియర్, రెమ్యూనరేషన్ వదిలేసి కేవలం మీకోసం వచ్చా

Thalapathi Vijay Speech : పీక్ లో ఉన్న కెరియర్, రెమ్యూనరేషన్ వదిలేసి కేవలం మీకోసం వచ్చా

Thalapathi Vijay Speech : దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్వయంవరం సినిమాతో రచయితగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, ఏజ్ అయిపోయిన సినిమా వాళ్ళందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు ఫెయిల్ అయిపోయిన లవర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు. అని ఒక సినిమాలో రాస్తాడు. ఇది అక్షరాల నిజమని చాలామంది ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే చాలామంది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ఆ తరువాత తమ ఉనికిని చాటుకోవడానికి రాజకీయాల్లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇలా రాజకీయాల్లో అడుగుపెట్టిన చాలామంది సక్సెస్ అయ్యారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే సీఎం అయ్యారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కొన్నేళ్లపాటు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండి ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు.


అయితే ఏ ఇండస్ట్రీలోనైనా ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని, ఎంతో పోటీని తట్టుకొని నిలబడగలగాలి. ఇక తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో తలపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారు తమిళ్ లో కూడా విజయ్ కి అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పాలి. కానీ తెలుగులో ఆ మార్కెట్ ను విజయ్ ప్రాపర్ గా యూస్ చేసుకోలేదు. స్నేహితుడు తుపాకీ సినిమాలకు తప్ప మిగతా సినిమాల ప్రమోషన్స్ కూడా రాలేదు. ఇకపోతే విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు విజయ్ పార్టీ మహానాడు సభ జరిగింది. ఈ సభలో విజయ్ స్పీచ్ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది.

విజయ్ మాట్లాడుతూ ఒక సందర్భంలో నా సినిమా కెరియర్ పీక్ లో ఉంది. అలానే నా రెమ్యూనరేషన్ కూడా అంతే స్థాయిలో ఉంది. వాటన్నిటిని వదులుకొని మిమ్మల్ని నమ్ముకొని మీకోసమే, మీ విజయ్ గా వచ్చాను అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి విజయ్ కు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలామంది సినిమా వాళ్ళ లాగా ఏజ్ అయిపోయిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. స్టార్ హీరోగా కొనసాగుతున్న తరుణంలోనే ప్రజా శ్రేయస్సుని కోరి తన కెరీర్ ను రిస్క్ లో పెట్టు మరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్. అయితే విజయ్ మాట్లాడిన స్పీచ్ అయితే మాత్రం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తర్వాత విజయ్ ను నమ్మి ఎంతవరకు రాజకీయ భవిష్యత్తుని ప్రజలు అందిస్తారో వేచి చూడాలి.


Related News

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

×