EPAPER

Thalapathi Vijay : ఇది కదా మాట్లాడే విధానం, ఇది కదా లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీ

Thalapathi Vijay : ఇది కదా మాట్లాడే విధానం, ఇది కదా లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీ

Thalapathi Vijay : రాజకీయాలకు సినిమా పరిశ్రమకు చాలా దగ్గర సంబంధం ఉంది. చాలామంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే రాజకీయాల్లో అందరూ తమను తాము నిరూపించుకోలేరు. అలా చాలామంది రాజకీయ రంగ ప్రవేశం చేసి మళ్లీ వెనక్కి తిరిగిన సినిమా వాళ్లు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. ఇకపోతే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల ప్రస్తావన వస్తే మొదట వినిపించే పేరు విజయ్. దీని కారణం విజయ్ చేసిన హిట్ సినిమాలు మాత్రమే కాకుండా విజయ్ పర్సనల్ వ్యక్తిత్వం కూడా ఒక కారణం అని చెప్పాలి. అలానే విజయ్ మాట్లాడిన మాటలు కూడా చాలా మందిని సినిమా వేదికలలో ఇప్పటివరకు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మొదటిసారి రాజకీయ రంగంలో తన స్పీచ్ ఇచ్చాడు విజయ్. ఇక ఈ స్పీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


రీసెంట్ గా విజయ్ టీవీకే అనే పార్టీను స్థాపించిన సంగతి తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈ పార్టీకి సంబంధించిన మహానాడు సభ నేడు జరిగింది. ఈ సభలో విజయ్ స్పీచ్ విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడున్న రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కొన్ని రోజుల క్రితం వరకు దారుణంగా ఉండేవి. ఎవరు మైక్ పట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం. కుటుంబ వ్యక్తులను విమర్శించడం ఇలా జరుగుతూ ఉండేవి. ఇలాంటి రాజకీయాలు తమిళ్లో కూడా జరిగాయి. బహుశా వీటన్నిటిని బాగా పరిశీలించి ఉంటాడు విజయ్. అందుకే తన స్పీచ్ లో ఈ ప్రస్తావన కూడా తీసుకుని వచ్చాడు.

ఇప్పటివరకు పార్టీ విషయాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడు విజయ్ మైక్ ముందు కనిపించిన ఎవరి పేరుని ప్రస్తావించే విమర్శించలేదు. అయితే దీనికి చాలామంది విజయ్ ఎవరి పేరుని పెట్టి విమర్శించడం లేదు అని కొంతమంది తమిళ ప్రజలు,ప్రేక్షకులు,అభిమానులు అనుకున్నారు. వాటన్నిటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు విజయ్. విజయ్ ఎవరి పేరు చెప్పట్లేదు విజయ్ కి భయం అని అనుకుంటున్నారేమో, నేను అలాంటి పాలిటిక్స్ చేయడానికి ఇక్కడికి రాలేదు. దుర్భసమైన మాటలను వాడి అవతల వారిని తిట్టడం కోసం నేను రాలేదు. ప్రజలు మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి నేను వచ్చాను. నాకు ఎవరితోనైనా ఐడియా లాజికల్ డిఫరెన్సెస్ ఉంటే వాళ్లతో నాకు డీసెంట్ అప్రోచ్ ఉంటుంది. అలానే డీసెంట్ ఎటాక్ కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తమిళ్లో ఎంజీఆర్, తెలుగులో నందమూరి తారకరామారావు వంటి నాయకులు ప్రస్తావన తీసుకొచ్చి కూడా మాట్లాడారు విజయ్. ఏదేమైనా విజయ్ మాట్లాడిన మాటలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన వాక్చాతుర్యం విజయ్ కు ఉంది అని చెప్పాలి.


Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×