Meenakshi Chaudhary Latest Photos: ఇప్పటికే ఎంతోమంది నార్త్ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో మీనాక్షి చౌదరీ కూడా ఒకరు. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. మొదటి మూవీ ఫ్లాప్ అయినా కూడా తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు బాగానే వచ్చాయి. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
‘ఖిలాడి’, ‘హిట్’ లాంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్‌గా ఫేమ్ దక్కించుకుంది మీనాక్షి చౌదరీ. అప్పుడే తమిళంలో కూడా తనకు ఛాన్సులు రావడం మొదలయ్యింది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
తమిళంలో విజయ్ లాంటి స్టార్ హీరోతో సైతం నటించింది మీనాక్షి. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’తో తాజాగా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించింది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
ప్రస్తుతం మీనాక్షి చౌదరీ చేతిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అయిన ‘లక్కీ భాస్కర్’ త్వరలో విడుదలకు సిద్ధమయ్యింది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన చిత్రమే ‘లక్కీ భాస్కర్’. ఆ సినిమా దుల్కర్ భార్యగా నటించింది మీనాక్షి చౌదరీ. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
దీపావళి సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ విడుదలకు సిద్ధం కాగా.. ప్రస్తుతం ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం దుల్కర్‌తో పాటు దుబాయ్‌లో చక్కర్లు కొడుతుంది మీనాక్షి చౌదరీ. (Image Source: Meenakshi Chaudhary/Instagram)
‘లక్కీ భాస్కర్’ మూవీ తెలుగులో విడుదలయినా కూడా తమిళం, మలయాళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. ట్రైలర్‌లో మీనాక్షి క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి. (Image Source: Meenakshi Chaudhary/Instagram)