Best Camera Smartphone Under 25000 : మీరు ఫోటో ప్రియులా? మెుబైల్ తో హై క్వాలిటీ ఫోటోస్ దిగాలనుకుంటున్నారా? టాప్ క్వాలిటీ కెమెరా ఫీచర్స్ ఉన్న మెుబైల్స్ కోసం చూస్తున్నారా? అయితే తక్కువ ధరలోనే దొరికే బెస్ట్ మెుబైల్స్ లిస్ట్ మీ కోసమే.
టాప్ క్వాలిటీ కెమెరా ఉన్న మెుబైల్స్ కావాలనుకునే వినియోగదారులకు ప్రముఖ కంపెనీలు హై స్టాండర్డ్ తో మెుబైల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక పవర్‌ఫుల్ ఫీచర్‌లతో రూ. 25,000లోపే బెస్ట్ మెుబైల్స్ ను అందుస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ లో కెమెరాతో పాటు పవర్ ఫుల్ ఫీచర్స్, డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇతర స్పెసిఫికేషన్స్ సైతం దిమ్మతిరిగేలా ఉన్న ఈ మెుబైల్స్ ఏంటో.. వాటి కాస్ట్ ఏంటో మీరూ ఓ లుక్కేయండి మరి.
HONOR 200 5G : హానర్ 200 5G మెుబైల్ ధర రూ. 24,998. ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్ ప్లే, డ్యూయల్ OIS 50MP + 50MP + 12MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
IQOO Z7 Pro 5G : iQOO Z7 Pro 5G మెుబైల్ ధర రూ. 20,999. ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ ప్లే, 4nm MediaTek డైమెసిటీ 7200 5G ప్రాసెసర్, 64MP ఆరా లైట్ OIS కెమెరాతో లాంఛ్ అయింది.
Lava Agni 3 5G : లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.24,999. ఈ మెుబైల్ డైమెన్సిటీ 7300Xగా ఉంది. ఇక 50MP ట్రిపుల్ AI కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ALSO READ : ఆ రోజు నుంచే ఓటీపీ సేవలు బంద్..! షాక్ ఇచ్చిన ఇండియన్ రెగ్యులేటరీ
Nothing Phone 2a Plus : ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 7350 ప్రో 5G ప్రాసెసర్, 50MP + 50MP ప్రైమరీ, 50MP ఫ్రంట్ కెమెరా, 6.7 AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో లాంఛ్ అయింది. ఇక ఈ ఫోన్ ధర రూ. 24,599.
Oneplus Nord CE4 : Oneplus Nord CE4 ధర రూ. 24,999. ఈ మెుబైల్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. OISతో ఉన్న SONY LYT-600 (IMX882) 50MP కెమెరా సెన్సార్ ఈ ఫోన్ లో అందుబాటులో ఉంది.
OPPO A3 Pro 5G : ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,999. ఇది 6.67 HD+ 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 45W SUPERVOOC తో లాంఛ్ అయింది. ఇక AI డ్యూయల్ అల్ట్రా-క్లియర్ కెమెరా, 50MP ప్రధాన కెమెరా + 2MP పోర్ట్రెయిట్ కెమెరా + 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా + AI పోర్ట్రెయిట్ రీటచింగ్ + డ్యుయల్-వ్యూ వీడియో ఆన్ తో లాంఛ్ అయింది.
OPPO F27 5G : OPPO F27 5G ధర రూ. 20,999. ఇది 6.67 FHD+ AMOLED డిస్ప్లే, 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరా, AI పోర్ట్రెయిట్ ఎక్స్‌పర్ట్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంది.
Samsung Galaxy M55s 5G : Samsung Galaxy M55s 5G రూ. 20,999. ఇందులో 50MP ట్రిపుల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 Gen 1, 4 Gen చిప్ సెట్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, సూపర్ AMOLED+ డిస్ప్లే ఉన్నాయి.