Lokesh US Visit :
⦿ కొనసాగుతున్న మంత్రి లోకేష్ అమెరికా పర్యటన
⦿ ఏపీలో పెట్టుబడులకు సానుకూల స్పందన
⦿ శాన్ ఫ్రాన్సిస్కో ప్రతినిధుల బృందంతో భేటీ
⦿ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ సందర్శించిన మంత్రి
⦿ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన లోకేష్
⦿ సానుకూలంగా స్పందంచిన ఈక్వెనెక్స్
⦿ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు
⦿ రాబోయే 25 ఏళ్లలో ఏపీకి ఉజ్వల భవిత
⦿ ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు
శాన్‌ఫ్రాన్సిస్కో, స్వేచ్ఛ : యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా అడుగులు అని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కో లో పారిశ్రామిక వేత్తలతో ఆదివారం మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని..ఈ డిసెంబర్ లో నిరంతర అభివృద్ధి పనులు ఉంటాయని శాన్ ఫ్రాన్సిస్కో ప్రతినిధుల బృందంతో తెలిపారు. దాదాపు ఐదు బిలియన్ల తో రాజధాని అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలాగే వైజాగ్ ఆర్థిక రాజధానిలో డాటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతకు ముందు ఈక్వెనెక్స్ డేటా సెంటర్ ను మంత్రి లోకేష్ సందర్శించారు.
సురక్షితమైన డేటా
ఈక్వెనెక్స్ అందిస్తున్న సేవలను అభినందించారు. సురక్షితమైన డేటా సర్వీసును అందిస్తున్న ఈక్వెనెక్స్ బ్రాంచిని ఏపీలోనూ ప్రారంభించాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఈక్వెనెక్స్ డేటా సర్వీస్ సెంటర్లు 260కి పైగా నెట్ వర్క్ లను కలిగివున్నాయి. ఏపీలో డాటా సెంటర్ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. ఏపీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, నూతన ఎలక్ట్రానిక్స్ విధానాలను సంస్థ ప్రతినిధులకు మంత్రి లోకేష్ తెలిపారు. అలాగే ఇన్ వెస్ట్ మెంట్స్ కు సంబంధించి ఏపీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని అన్నారు. రాబోయే ఇరవై ఐదేళ్లలో ఏపీకి ఉజ్వల భవిష్యత్ ఉంని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయని తెలిపారు. సాంకేతికంగా ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందుబాలులోకి తెస్తున్నామని అన్నారు. ఏపీలో పెట్టుబడుల విషయంపై ఈక్వెనెకస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.