EPAPER

Game Changer Teaser: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌పై కీలక అప్డేట్

Game Changer Teaser: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌పై కీలక అప్డేట్

Game Changer Teaser: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలయిన తర్వాత అందులో హీరోలుగా నటించిన రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లకు గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు లభించింది. అందుకే రామ్ చరణ్ అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ గురించే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వల్ల పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల అవుతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మూవీ విడుదలకు ఇంకా టైమ్ ఉన్నా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు.


కొత్త పోస్టర్

దసరా సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీ గురించి ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుందని కొత్త పోస్టర్‌తో విడుదల చేశారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల హైప్ క్రియేట్ అయ్యింది. అసలైతే ‘గేమ్ ఛేంజర్’ మూవీ అనేది ఎప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అలాంటి సమయంలో రిలీజ్ డేట్ గురించి చెప్పడంతో అందరి ఆనందానికి హద్దులు లేవు. ఇప్పుడు ఏకంగా టీజరే విడుదల కానుంది అని చెప్పడంతో సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ పక్కా అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. తాజాగా ఒక కొత్త పోస్టర్‌తో ఈ టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.


Also Read: రవితేజ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. మాస్ ఆడియన్స్ కు జాతరే..

న్యాయమైన ఉద్యోగి

‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా విడుదల అవ్వడానికి ఇంకా 75 రోజులు మాత్రమే ఉంది. అందుకే టీజర్ గురించి అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టున్నారు. త్వరలోనే టీజర్ వస్తుంది అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ మొహం కనిపించకుండా చేశారు. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడనే విషయంలో బయటికొచ్చింది. అదే ఈ పోస్టర్‌లో స్పష్టమవుతోంది. ఎంతమంది అడ్డొచ్చిన న్యాయంగా పనిచేసే ఉద్యోగిగా ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్‌తో చెప్పకనే చెప్పాడు దర్శకుడు శంకర్.

పటాసులు పేలనున్నాయి

త్వరలోనే దీపావళి కావడంతో ఆ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్ అవుతుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. త్వరలోనే గేమ్ ఛేంజర్ పటాసులు పేలనున్నాయి అంటూ ఈ టీజర్ అప్డేట్ బయటికొచ్చింది. అంటే దీపావళికి కచ్చితంగా టీజర్ ఫిక్స్ అని అనుకుంటున్నారు. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. సునీల్, శ్రీకాంత్ లాంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంకా ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ బయటికొస్తే అసలు ఈ మూవీపై ప్రేక్షకుల్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. 75 రోజుల్లో థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది.

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×