EPAPER

CM Revanth Reddy: యాదవులను రాజకీయంగా ప్రోత్సహిస్తా.. మూసీని జీవనదిగా మారుస్తా.. సదర్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: యాదవులను రాజకీయంగా ప్రోత్సహిస్తా.. మూసీని జీవనదిగా మారుస్తా.. సదర్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

– నగరాభివృద్ధిలో యాదవుల పాత్ర భేష్
– తెలంగాణ సంస్కృతిలో భాగమే సదర్
– పశుపోషణే కాదు.. ధర్మరక్షణా మీ బాధ్యత
– యాదవులను రాజకీయంగా ప్రోత్సహిస్తాం
– అంజన్న తడబడ్డా.. అనిల్‌కు అవకాశమిచ్చాం
– మూసీని జీవనదిగా మార్చే బాధ్యత మాదే
– సదర్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


హైదరాబాద్, స్వేచ్ఛ: CM Revanth Reddy: యాదవులు రాజకీయంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మం వైపు నిలిచే యాదవులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ అభివృద్ధి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెంచటం ద్వారా దీనిని విశ్వనగరాల సరసన నిలుపుతామని ప్రకటించారు. మూసీ నిర్వాసితులకు అండగా నిలవటంతో బాటు దానిని జీవనదిగా మార్చుతామని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పలువురు నేతలు పాల్గొ్న్నారు.

ఇక అధికారికంగా..
హైదరాబాద్ నగరంలో అనాదిగా సదర్ ఉత్సవాలను అత్యంత వైభవంగా యాదవ సోదరులు నిర్వహించటం సంతోషకరమని, ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతిలో భాగమని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సదర్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని తాము విపక్షంలో ఉండగా, ప్రకటించామని, ఇకపై ఏటా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సభా వేదిక నుంచే అధికారులకు ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ సదర్ సమ్మేళనం గొప్పతనాన్ని ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని కొనియాడారు.


అంజన్న గెలిచుంటే..
యాదవ సోదరులు రాజకీయంగా వచ్చిన అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని సీఎం పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి బరిలో నిలిచిన అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించుకుని ఉంటే, నేడు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండేవారని వ్యాఖ్యానించారు. ఆయన ఆ ఎన్నికలలో గెలవకున్నా.. కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడైన అనిల్ కుమార్ యాదవ్‌ సేవలను గుర్తించి, యాదవ సామాజిక వర్గ ప్రతినిధిగా రాజ్యసభకు ఎంపికచేసిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మూసీకి మంచిరోజులు
హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని సీఎం గుర్తుచేశారు. మూసీ మురికి కూపంగా మారిన తర్వాత ఆ ప్రభావం వల్ల నగరంలో పశుసంపద కూడా బాగా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. అనేక సమస్యలకు పరిష్కారంగా తమ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. మురుగులో జీవించే అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచటమే గాక ఈ నదిని తిరిగి జీవనదిగా మార్చుతామని ప్రకటించారు.

Also Read: Big Tv news Threat : రేవ్ పార్టీపై వార్తలు.. బిగ్ టీవీకి బీఆర్ఎస్ అనుచరుల బెదిరింపులు

ధర్మానిదే జయం..
చరిత్రలో ధర్మం వైపు నిలబడిన వారే అంతిమంగా విజయాన్ని సాధించారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. నాడు కౌరవుల దుర్మార్గాలను సరిదిద్దాలని శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో శ్రమించాడని, కానీ వారు ఆయన మాట వినకపోవటంతో ధర్మమార్గంలో నడిచే పాండవుల పక్షాన నిలిచారని, ఆ ధర్మమూర్తి పాండవుల పక్షాన నిలవటం వల్లనే కురుక్షేత్ర సంగ్రామ భూమిలో విజయం పాండవులను వరించిందని పేర్కొన్నారు. యాదవ సోదరులంతా ధర్మమార్గంలో నిలిచి, మంచిని పాడు చేయాలనే శక్తుల మీద పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

Related News

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Rahul Gandhi Tour: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ

Salvo industries : అనామక కంపెనీకి బడా టెండర్.. కథంతా నడిపించిన ఆ లీడర్

Congress : మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రె’ఢీ’

Janwada Farm House : సరే ఏం జరగలేదు.. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమా? – బీఆర్ఎస్ కు ఎంపీ అనిల్ కుమార్ సవాల్

CM Revanth Reddy: గృహ ప్రవేశాలు ఇలా కూడా చేస్తారా? తప్పేలేకుంటే ఎందుకు పారిపోయారు? కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. ఆ పథకం జనవరి నుండే ప్రారంభం.. ఇక వారికి పండగే!

×