EPAPER

Vidhya Balan: కన్న తల్లిదండ్రుల ముందే ఘోరంగా అవమానించారు..!

Vidhya Balan: కన్న తల్లిదండ్రుల ముందే ఘోరంగా అవమానించారు..!

Vidhya Balan: డర్టీ పిక్చర్ బ్యూటీ విద్యాబాలన్ (Vidhya Balan) తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు ఏడు ఫిలింఫేర్ అవార్డులను అలాగే అనేక అవార్డులను సొంతం చేసుకుంది. 2014లో ఈమె నటనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోకి రావాలని కలలు కన్న ఈమె 1995 సిట్ కామ్ ‘హమ్ పాంచ్ ‘ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది.


అలా తొలి పరిచయం..

ముంబై విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసిస్తున్న సమయంలోనే సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలా పలు యాడ్స్ చేస్తూ , మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. ఇకపోతే ఈమె లైమ్ లైట్ లోకి వచ్చింది మాత్రం బెంగాలీ చిత్రం భలో తేకో. 2003లో వచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాతో తొలిసారి సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమె మొదటి హిందీ చిత్రం పరిణీతి. 2005లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2007లో భూల్ భూలయ్యా సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే సీజన్ 3 లో నటిస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఒక నిర్మాత తనను తన తల్లిదండ్రుల ముందే ఘోరంగా అవమానించాడు అంటూ చెప్పుకొచ్చింది.


తల్లిదండ్రుల ముందే ఆ నిర్మాత అవమానించారు..

భూల్ భూలయ్యా -3 లో నటిస్తున్న విద్యాబాలన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అందులో భాగంగానే దక్షిణాది నిర్మాత ఒకరు తనను అవమానించారని చెప్పుకొచ్చింది. విద్యా బాలన్ మాట్లాడుతూ.. మలయాళం మూవీ చక్రం సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత తమిళ చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు. ఆ చిత్రం నిర్మాత యాక్టింగ్ రాదు.. డాన్స్ రాదు.. అసలు హీరోయిన్ లా కనిపిస్తున్నావా ?అని నా తల్లిదండ్రుల ముందే నన్ను అవమానించారు. అయితే ఆరోజు ఆ అవమానాన్ని నేను దృఢంగా తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నాను అంటూ తెలిపింది విద్యాబాలన్. ఇక విద్యాబాలన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

విద్యాబాలన్ అందుకున్న అవార్డులు..

ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు , హేళనలు ఎదుర్కొన్న విద్యాబాలన్ ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఇంతలా అంటే ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో అవార్డులు అందుకోలేదు అనడంలో సందేహం లేదు . 2011లో ది డర్టీ పిక్చర్స్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. పరిణీత అనే హిందీ ఫిలిం కోసం ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో ఫిలింఫేర్ అవార్డును దక్కించుకుంది. ఆ తర్వాత మరెన్నో అవార్డులను సొంతం చేసుకుంది విద్యాబాలన్.

Related News

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

×