Tomato Scrub: టమాటో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలను పోగొట్టి, ముఖాన్ని మెరసేలా చేస్తాయి. తరుచుగా ముఖానికి టమాటోను ఉపయోగిస్తే ఫేస్‌పై ఉండే మచ్చలు తగ్గిపోయి.. ముఖం తెల్లగా మారుతుంది. టమాటోలో కొన్ని రకాల పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడవచ్చు. లేదా టమాటోతో స్క్రబ్ లను తయారు చేసుకుని ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
టమాటోలో లైకోపీన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని టోన్ చేయడంలో, మొటిమలతో పోరాడి కాంతివంతం చేయడంలో సహాయపడతాయి. టమాటోలతో తయారుచేసే 5 ప్రభావవంతమైన స్క్రబ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. టమాటో, షుగర్ స్క్రబ్:
కావలసినవి:
టమాటో గుజ్జు- 1 టేబుల్ స్పూన్
చక్కెర-1 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా టమాటో పేస్ట్‌లో పంచదార కలపండి. ఈ స్క్రబ్‌ను మీ చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.ఇది చర్మ రంధ్రాలను క్లియర్ చేయడంతో పాటు మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
2. టమాటో, శనగపిండితో స్క్రబ్:
కావలసినవి:
టమాటో గుజ్జు- 1 టేబుల్ స్పూన్
శనగపిండి- 1 టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా టమాటో పేస్ట్‌లో మెత్తగా చేసి, శనగపిండిని కలిపి పేస్ట్ లాగా చేయండి. తర్వాత ఈ స్క్రబ్‌ని మీ చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
3. టమాటో, నిమ్మరసంతో స్క్రబ్:
కావలసినవి:
టమాటో గుజ్జు- 1 టేబుల్ స్పూన్
నిమ్మ రసం- 1 టీ స్పూన్
తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదుల్లో టమాటో పేస్ట్‌తో పాటు నిమ్మరసం కలిపి మిక్స్ చేయండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా చర్మం కూడా మృదువుగా మారుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: మీ ముఖాన్ని తెల్లగా మార్చే బెస్ట్ సోప్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా !
4. టమాటో, తేనె స్క్రబ్:
కావలసినవి:
టమాటో పేస్ట్- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో టమాటో పేస్ట్‌తో పాటు తేనెను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత ఫేస్ శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.