OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వాస్తవికతకు దగ్గరగా కనిపిస్తాయి. ఆ సినిమాలను చూశాక రియల్ లైఫ్ లో కొన్ని మర్చిపోలేని మెమరీస్ అవుతాయి. కొన్ని విషయాలు ఒళ్ళు జలదరించేలా చేస్తాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ నే ఈరోజు మన మూవీ సజెషన్. సినిమా స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? ఈ విషయాలను తెలుసుకుందాం…
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…
సాధారణంగా చాలామంది లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనే విషయాన్ని బాగా నమ్ముతారు. అమ్మాయి గాని అబ్బాయి గాని అవతలి వ్యక్తి గురించి పెద్దగా తెలియకుండానే ప్రేమలో మునిగి తేలుతారు. అతి తక్కువ శాతం మాత్రమే ఇందులో జెన్యూనిటీ ఉంటుంది. కానీ చాలా వరకు ఇలాంటి వాటి వల్ల ముఖ్యంగా అమ్మాయిలు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చూస్తే జన్మలో తెలియని వ్యక్తితో ప్రేమాయణం నడపరు. ఈ మూవీ పేరు “ఫ్రెష్” (Fresh). ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెవతే …
సినిమాలో హీరోయిన్ ఒక స్టూడెంట్. కానీ తనకు తగ్గ పద్ధతిగల బాయ్ ఫ్రెండ్ కోసం ఆమె డేటింగ్ యాప్ లు అన్నీ తెగ జల్లెడ పట్టేస్తుంది. కానీ ఒక్కడు కూడా మంచి జోడి అనేలా ఉండకపోవడం ఆమెను నిరాశకు గురి చేస్తుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వేటలో ఉన్నప్పుడే ఒకరోజు సూపర్ మార్కెట్ కు వెళ్లగా ఓ వ్యక్తి తగులుకుంటాడు. అక్కడికక్కడే హీరోయిన్ తో పులిహోర కలపడం కాకుండా ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకుంటాడు. అతని పులిహోర విషయాలకు పడిపోయిన హీరోయిన్ వెంటనే నెంబర్ ఇచ్చి ఫ్రెండ్ అవుతుంది. ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండానే డిన్నర్ డేట్ కి కూడా వెళ్తారు. అక్కడే అతను వేసే కుళ్ళు జోకులు చూసి తనకు తగ్గవాడు అతనే అని ఫిక్స్ అవుతుంది. అనుకున్నదే తడవుగా అతన్ని తన రూమ్ కి తీసుకెళ్తుంది. ఆ తరువాత కూడా అచ్చం ఇలాగే కలుస్తూ ఉంటారు.
అయితే ఓ రోజు హీరోయిన్ ను హీరో తన ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేద్దామని హీరోయిన్ తో చెప్తాడు. ఇదే విషయాన్ని హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర ప్రస్తావించగా, ఆమె అతని గురించి ముందు వెనక ఎలాంటి విషయం తెలియకుండా తొందర పడొద్దు అని హెచ్చరిస్తుంది. కానీ హీరోయిన్ వినకుండా ఫామ్ హౌస్ కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్లాక ఆ ఇంటిని చూసి మంచి సౌండ్ పార్టీ నే పట్టాను అని ఆలోచనతో సంబర పడుతుంది. ఇక ఆమె ఆ సంబరంలోనే నాలుగు పెగ్గులు ఎక్స్ట్రా తాగుతుంది. కానీ అసలు ఈ విషయం ఏమిటంటే అందులో ఆమె బాయ్ ఫ్రెండ్ డ్రగ్స్ కలుపుతాడు. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి హీరోయిన్ కాళ్లు చేతులూ కట్టేసి ఒక అండర్ గ్రౌండ్లో పడి ఉంటుంది. ఆ తర్వాత హీరో వచ్చి ఓ గుండె పగిలే నిజాన్ని చెప్తాడు. ఆ నిజం ఏంటి? హీరోయిన్ వాడి నుంచి ఎలా తప్పించుకుంది? అసలు వాడు ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేశాడు ? ఈ విషయం తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కెయ్యండి.