Ravi Teja : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఆ మూవీ రిలీజ్ ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న రిలీజ్ తర్వాత ఆ బజ్ లేదు. యావరేజ్ టాక్ తో కొద్ది రోజులకే థియేటర్ల నుంచి లెఫ్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చెయ్యడానికి కాస్త టైమ్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించాడు. రవి తేజ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే సినిమాకు మాస్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ ఏంటో? సినిమా డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
హీరో రవి తేజ మొన్నీ మధ్య చేసిన మిస్టర్ బచ్చన్ బ్లారీ ప్లాఫ్ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాను గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. రైటర్ భాను భోగవరపు దర్శకుడు. ఈ చిత్రానికి ‘మాస్ జాతర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రవితేజ లక్ష్మణ్ భేరీ అనే పాత్ర లో కనిపించబోతున్నారు. తెలంగాణ నేపథ్యం లో సాగే కథ. ఈ మూవీ మొత్తం తెలంగాణ స్లాంగ్ వినిపిస్తుంది.. అయితే ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. 2025 సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఇటీవల రవి తేజకు గాయమైంది. ఆపరేషన్ కూడా జరిగింది. దాంతో ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు 2025 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘సామజవరగమన’ లాంటి హిట్ చిత్రాలకు రచయితగా పని చేశారు. భాను భోగవరపు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ధమాకా’ చిత్రం తో భీమ్స్ ఆ లీగ్ లోకి చేరిపోయిన సంగతి తెలిసిందే.. ఇక త్వరలోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం. ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ధమాకా తర్వాత ఒక్క హిట్ సినిమా కూడా ఇతని ఖాతాలో పడలేదు.. ఈ సినిమా అన్న రవి తేజ కోరికను తీరుస్తుందేమో చూడాలి.. ఈ సినిమా హిట్ అయితే వరుస సినిమాలను అనౌన్స్ చెయ్యాలని రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఇక లేకుంటే సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది. ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 4 సినిమాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలు పూర్తి అయ్యాక తమిళ్ చిత్రాలతో బిజీ అవ్వనుందని టాక్..