EPAPER

Abhishek bacchan: ఆ రూమర్స్‌కు శుభం కార్డు వేసిన అభిషేక్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్!

Abhishek bacchan: ఆ రూమర్స్‌కు శుభం కార్డు వేసిన అభిషేక్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్!

Abhishek bacchan.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్ (Abhishek bacchan). అయితే తండ్రి రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్‌లో ఒక మోస్తారు ఇమేజ్ సొంతం చేసుకున్న అభిషేక్ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ను వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ ఊహించని విధంగా అందరికీ షాకిచ్చాడు.


అభిషేక్ – ఐశ్వర్య విడిపోతున్నారంటూ వార్తలు..

అభిషేక్.. తన తల్లి మాటలు విని భార్యను దూరం పెడుతున్నారని కొంతమంది అంటే, ఐశ్వర్యరాయ్ ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుందంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. దీనికి తోడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఐశ్వర్యరాయ్ భర్తతో కాకుండా రేఖాతో కలిసి ఫోటోలు దిగడం కూడా  చర్చనీయాంశంగా మారింది. ఇలా రోజుకొక వార్త వినిపించడంతో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపించాయి.


విడాకులపై స్పందించిన అభిషేక్ బచ్చన్..

అయితే, అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపుతున్నారు అభిమానులు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్యరాయ్‌ను ఫాలో అవుతున్నఏకైక వ్యక్తి అభిషేక్ బచ్చన్ మాత్రమే. ఐశ్వర్యరాయ్ – ఆరాధ్య విషయంలో ఆయన ఎప్పుడూ కూడా తన ప్రేమాభిమానాలను దాచుకోలేదు. కానీ అందుకు విరుద్ధంగా మీడియాలో ప్రచారం సాగడం దురదృష్టకరమని వారి అభిమానులు భావిస్తున్నారు.

నా జీవితంలో ఎప్పటికీ ఆమె చేయి విడువను..

తాజాగా బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అభిషేక్ కి.. ఐశ్వర్యతో 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో మీ అందమైన ప్రయాణం ఎలా అనిపించింది..? అని ప్రశ్నించగా.. దానికి అభిషేక్ మాట్లాడుతూ.. నా భార్య అసాధారణమైనది. ఆమె తనకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుందని, ముఖ్యంగా సినీ పరిశ్రమ నుండి భాగస్వామిని కలిగి ఉండడం ఎంత గొప్ప ప్రయోజనమో అని ఆయన వివరించారు. ఐశ్వర్య నాకంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి తాను ప్రతీదీ అర్థం చేసుకుంటుంది అంటూ భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భార్య నెగిటివ్ కామెంట్స్ ని ఏ రోజు కూడా తీసుకోదని, తనపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అసలు ఊరుకోదని కూడా చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్. మొత్తానికి అయితే ఎన్ని రూమర్స్ వినిపించినా.. తాము మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామని రూమర్స్ కి శుభం కార్డ్ వేశారు అభిషేక్ బచ్చన్. ఇప్పటివరకు ఈ జంటపై రూమర్స్ గుప్పించిన యాంటీ ఫ్యాన్స్ ఈ విషయం విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×