Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కోసం కంటెస్టెంట్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ కంటెస్టెంట్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం కోసం సెలబ్రిటీలను రంగంలోకి దించారు మేకర్స్. కొందరు సెలబ్రిటీలు వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగా.. కొందరు వచ్చి పాటలతో, కామెడీతో అలరించారు. అయితే ఆది.. బిగ్ బాస్ స్టేజ్‌పై రాకుండా అసలు దసరా, దీపావళి సెలబ్రేషన్స్ పూర్తి కావు కాబట్టి ఈసారి కూడా ఆది వచ్చి కంటెస్టెంట్స్ గురించి కామెడీ చేస్తూ వారికి సినిమా చూపించాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక ఈ ప్రోమో చివర్లో కంటెస్టెంట్స్ అందరినీ ఏడిపించారు నాగ్
అలాంటి సినిమాలు చూపించారు
ముందుగా ఆది రాగానే రేయ్ అవినాష్ అంటూ పలకరించాడు. రా అనొద్దు అంటూ కామెడీగా రియాక్ట్ అయ్యాడు అవినాష్. ‘‘ఇంకొకసారి యష్మీ, ప్రేరణతో ఫ్లర్ట్ చేస్తే ఈ హౌస్‌లోనే ఉండు ఆ హౌస్‌లోకి రాకు అని అను చెప్పమన్నది. తేజతో నువ్వు ఇంకాసేపు ఎక్సర్సైజ్ చేయించినా విష్ణుప్రియా చెప్పిన కెమికల్స్ రిలీజ్ అయ్యేవి’’ అని అవినాష్‌కు ఆది చెప్పగానే అందరూ నవ్వారు. ‘‘సోనియా ఉన్నప్పుడు పృథ్వి, నిఖిల్ కలిసి ప్రేమదేశం సినిమా చూపించారు. తర్వాత విష్ణుప్రియా వచ్చి ప్రేమించుకుందాం రా అంది. ఆ తర్వాత నయని దూరి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూపించింది. గంగవ్వ ఖాళీగా ఉండలేక కాంచన సినిమా చూపించింది’’ అంటూ కంటెస్టెంట్స్ అందరికీ సినిమా చూపించాడు ఆది.
Also Read: దివాలీ ధమాకా… హౌస్ లో సందడి చేసిన సెలబ్రిటీస్..!
పేరడీ పాటల జోరు
గంగవ్వకు దెయ్యం పట్టినట్టుగా టేస్టీ తేజ చేయించిన ప్రాంక్ గురించి మాట్లాడి అందరినీ నవ్వించాడు ఆది. ఆ తర్వాత మెహ్రీన్ వచ్చి తన పర్ఫార్మెన్స్‌తో ఉర్రూతలూగించింది. ఆపై కంటెస్టెంట్స్ అంతా ‘చాప్‌స్టిక్స్’ టాస్క్ ఆడారు. దీపాలను చాప్‌స్టిక్స్‌తో తీసుకొని అవతల వైపు ఉన్న టేబుల్‌పై పెట్టాలి అన్నదే ఈ టాస్క్. ఇందులో కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ఆడిన తర్వాత సింగర్ సమీరా భరద్వాజ్ వచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేసింది. అవినాష్, టేస్టీ తేజ, నిఖిల్, యష్మీ, రోహిణిలపై పేరడి పాటలు పాడడం కూడా ఈ ప్రోమోలో చూపించారు. మిగతా కంటెస్టెంట్స్‌పై కూడా పేరడి పాటలు పాడుతుందని అర్థమవుతోంది.
ఏడ్చేసిన గంగవ్వ
చివర్లో కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేసి అందరినీ ఏడిపించారు నాగార్జున. గంగవ్వ కూతురు, టేస్టీ తేజ తల్లిదండ్రుల ఫోటోలు చూపించారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికే వారి ఇంటి నుండి మెసేజ్ వస్తుంది అని చెప్పారు. దీంతో ఇద్దరిలో ఒకరికే ఆ ఛాన్స్ వస్తుంది అనడంతో గంగవ్వ ఏడ్చేసింది. అలాగే అవినాష్ లేదా రోహిణి, మెహబూబ్ లేదా ప్రేరణ.. వీరిలో ఒకరికే వారి ఇంటి నుండి మెసేజ్ వస్తుందని కూడా అన్నారు. అలా దీపావళి కానుకగా తమ ఇంటి సభ్యుల నుండి మెసేజ్ అందుకునే అవకాశం కంటెస్టెంట్స్‌కు వచ్చినా అందులో చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు నాగార్జున. మరి ఇందులో ఎవరికి వారి ఇంటి నుండి మెసేజ్‌లు వస్తాయో చూడాలి.