EPAPER

Janvada Farm House: ఫామ్ హౌస్ లో అసలేం జరిగింది? కేటీఆర్ ప్రమేయం ఉందా? క్యాసినోకు అడ్డాగా మారిందా? విస్తుపోయే నిజాలు..

Janvada Farm House: ఫామ్ హౌస్ లో అసలేం జరిగింది? కేటీఆర్ ప్రమేయం ఉందా? క్యాసినోకు అడ్డాగా మారిందా? విస్తుపోయే నిజాలు..

Janvada Farm House: అర్థరాత్రి కేకలు.. ఒకటే సౌండ్స్.. అసలు స్థానికులకు ఏమి అర్థం కాని పరిస్థితి. ఇదేదో ఒక్కరోజు తతంగం కాదట. రోజూ జరిగే తతంగం అంటున్నారు స్థానికులు. ఎవరెవరో వస్తుంటారు.. పోతుంటారు.. ఒక మాజీ మంత్రి అప్పుడప్పుడు చుట్టపుచూపులా వస్తారు. కానీ ఆయనేం చేస్తారో మాకైతే తెలియదు కానీ ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు అంటున్నారు జన్వాడ ఫామ్ హౌస్ స్థానికులు.


హైదరాబాద్ లోని జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు నిర్వహించి, రేవ్ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీపై పక్కా సమాచారం స్థానికుల ద్వారా అందుకున్న పోలీసులు ప్లాన్ గా మెరుపు దాడులు చేశారు. అయితే రేవ్ పార్టీ జరిగిన తీరు చూసి, పోలీసులు ఖంగుతిన్నారట. యువతులతో డ్యాన్సులు, బ్లాక్ జాక్ గేమ్ ఆడినట్లు ఆధారాలు గుర్తించిన పోలీసులు, ఇది క్యాసినో కల్చర్ కు ఏమాత్రం తగ్గదనేస్తున్నారట. మొత్తం రేవ్ పార్టీలో 40 మంది వరకు పాల్గొన్నట్లు, వారి వివరాలను బయటకు రావాల్సి ఉంది.

విదేశీ మద్యం..
ఈ ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించిన పోలీసులకు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఇతర దేశాలకు చెందిన మద్యం సీసాలు లభించడం విశేషం. 12 డ్యూటీ ఫ్రీ ఎఫ్.ఎల్ బాటిల్స్, 1 న్యూ ఢిల్లీ లిక్కర్ ఎఫ్ ఎల్ బాటిల్, ఇలా పలు బ్రాండ్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, డ్రగ్స్ ఆనవాళ్ళ కోసం వేట సాగిస్తున్నారు.


ఎవరు విజయ్ మద్దూరి?
రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి, మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విజయ్ కు పోలీసులు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ గా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఫామ్ హౌస్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందినది కాగా, ఇక్కడ తరచుగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసిందని సమాచారం. అయితే విజయ్ మద్దూరి, రాజ్ పాకాల గృహాలలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గతంలో సన్ బర్న్ పేరుతో విజయ్ బాబు నిర్వహించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ పబ్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.

రూ. 15 కోట్లతో ఫాంహౌస్ నిర్మాణం..
జన్వాడలో గల కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 7 ఎకరాలలో ఫామ్ హౌస్ నిర్మాణం జరగగా, జీవో111 లోని రూల్స్ అతిక్రమించి నిర్మించినట్లు సమాచారం. కాగా ఈ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేయగా, అక్రమ నిర్మాణాలు జరిగాయా లేదా అనే విషయంపై కూడా అధికారులు ఆరాతీస్తున్నారు.

విచారణ కొనసాగిస్తున్నాం – శ్రీలత, ఎక్సెస్ సీఐ
జన్వాడ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించినట్టు తాము గుర్తించామని, కర్ణాటక, మహారాష్ట్ర మద్యం సీసాలతో పాటు ఫారిన్ లిక్కర్ ను తాము స్వాధీనం చేసుకున్నామన్నారు. పూర్తి విషయాలు విచారణలో వెలుగులోకి వస్తాయని ఆమె తెలిపారు.

ఆ ప్రముఖులు ఎవరు?
జన్వాడ ఫామ్ హౌస్ లో పోలీసుల దాడికి ముందు వెళ్ళిన ఆ 20 మంది ఎవరన్నది పోలీసుల ప్రకటనతో వెల్లడి కావాల్సి ఉంది. అయితే పోలీసుల దాడికి ముందు ఓ మాజీ మంత్రి అక్కడి నుండి వెళ్ళినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పోలీసులు వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందుకొని జారుకున్నారా.. లేదా అనేది ఫామ్ హౌస్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బహిర్గతం కావాల్సి ఉంది. అయితే పార్టీలో పాల్గొన్న వారి పేర్లను పోలీసులు బహిరంగ పరచాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేస్తున్నారు.

Related News

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Rahul Gandhi Tour: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ

Salvo industries : అనామక కంపెనీకి బడా టెండర్.. కథంతా నడిపించిన ఆ లీడర్

Congress : మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రె’ఢీ’

Janwada Farm House : సరే ఏం జరగలేదు.. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమా? – బీఆర్ఎస్ కు ఎంపీ అనిల్ కుమార్ సవాల్

CM Revanth Reddy: గృహ ప్రవేశాలు ఇలా కూడా చేస్తారా? తప్పేలేకుంటే ఎందుకు పారిపోయారు? కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. ఆ పథకం జనవరి నుండే ప్రారంభం.. ఇక వారికి పండగే!

×