OTT Movie : ఓటిటిలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రొమాంటిక్ కేటగిరీకి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. రొమాంటిక్ కేటగిరిలో ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే సినిమాలు కొన్ని అయితే, ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా చూడాల్సిన సినిమాలు మరికొన్ని ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా రెండవ కేటగిరీకి సంబంధించింది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే….
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఇండియాలో అందుబాటులో ఉన్న బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) కూడా ఒకటి. ఇందులో తెలుగుతోపాటు అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ సినిమాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏ రేటెడ్ మూవీ మాత్రం కేవలం ఇంగ్లీష్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు “యాన్ యాంఫిబియస్ మాన్స్టర్” (An Amphibious Monster).
కథలోకి వెళ్తే…
సినిమాలో ఒక సైంటిఫిక్ ప్రయోగం జరుగుతుంది. నీళ్లలో ఉండే ఒక వింత జంతువును బంధించి, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కప్పలాంటి ఈ జంతువు మనిషి పోలికలతో అచ్చం మనిషిలాగే ఉంటుంది. ఇక కొన్నిసార్లు ఆ వింత జంతువును కొట్టి టార్చర్ చేస్తూ ఉంటారు. దాని గొలుసులతో కట్టి బంధించి ఎక్కడికి వెళ్లకుండా ఓ రూమ్లో పడేస్తారు. తిండి కూడా సరిగా పెట్టరు. అయితే అందులోనే పని చేస్తున్న హీరోయిన్ దానికి అప్పుడప్పుడు గుడ్లు ఉడకబెట్టి తినడానికి సీక్రెట్ గా ఇస్తూ ఉంటుంది. ముందుగా ఆ మాన్స్టర్ ఈ అమ్మాయి దగ్గరనుంచి తీసుకోవడానికి అస్సలు ఇష్టపడదు. కానీ హీరోయిన్ తాను హాని చేయనని నమ్మకాన్ని కలిగించి గుడ్లను పెడుతూ ఉంటుంది. అక్కడ పనిచేసే ఏ ఒక్కరికి కూడా హీరోయిన్ ఆ మాన్స్టర్ తో ఇలా ఫ్రెండ్లీగా ఉంటుందనే విషయం తెలీదు.
ఒకానొక టైంలో అక్కడ క్లీనింగ్ అని వెళ్లి ఏకంగా ఆ మాన్స్టర్ ముందు బట్టలు లేకుండా కన్పిస్తుంది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఆ మాన్స్టర్ కూడా ఈ అమ్మాయిని ఇష్టపడుతుంది. ఇక ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్న క్రమంలో ఓ వ్యక్తి ఈ మాన్స్టర్ని దయ లేకుండా అత్యంత దారుణంగా కొట్టి పడేస్తాడు. దీంతో ఎలాగైనా సరే ఆ మాన్స్టర్ని కాపాడాలి అని డిసైడ్ అవుతుంది హీరోయిన్. ఒక సైంటిస్ట్ సహాయంతో తను అనుకున్న పనిని చేస్తుంది. దీంతో ఆ ఏరియా మొత్తాన్ని ఈ మాన్స్టర్ కోసం జల్లెడ పడతారు. అయితే చివరికి హీరోయిన్ తో పాటు ఆ మాన్స్టర్ కూడా దొరికిపోతుంది. దీంతో ఎలాగైనా సరే ఆ మాన్స్టర్ ని చంపాలని మనుషులు ప్రయత్నిస్తారు. మాన్స్టర్ చంపాలంటే అంతకంటే ముందు తనను చంపాలని హీరోయిన్ అడ్డుపడుతుంది. చివరికి హీరోయిన్ తను అనుకున్నట్టే ఆ మాన్స్టర్ ని కాపాడగలిగిందా? వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎక్కడిదాకా వెళ్ళింది? సినిమాలో క్లైమాక్స్ స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఓసారి ఈ సినిమాను చూసేయండి.