Bigg Boss: ఒకప్పుడు యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత తన అందచందాలతో సినిమాలలో కూడా అక్కడక్కడ అలరించిన విష్ణు ప్రియ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువతకు దగ్గరగా ఉండే ఈమె .. మంచి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎక్కువగా కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించే విష్ణు ప్రియ అప్పుడప్పుడు ఫెస్టివల్స్ సందర్భంగా పలు ప్రముఖ ఛానల్స్ చేసే ప్రత్యేకమైన షోలలో పాల్గొంటూ అలరిస్తూ ఉంటుంది. ఇక ఆ పాపులారిటీతోనే ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది విష్ణు ప్రియ.
మొదటి రోజు నుంచే వివాదాలకు పోకుండా తన పని తాను చూసుకుంటూ కన్నడ సీరియల్ నటుడు పృథ్వీ వెనకాలే తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం హౌస్ లో ఈమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పాపం నరకం అనుభవిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. అసలు విషయంలోకెళితే విష్ణు ప్రియ ఈ రేంజ్ లో నరకం అనుభవించడానికి కారణం పృథ్వీ, యష్మీ అని చెప్పవచ్చు. పృథ్వీ ను విష్ణు ప్రియ నిజాయితీగా మొదటి నుండి ఇష్టపడుతోంది. కంటెంట్ కోసం ఎలాంటి పిచ్చి డ్రామాలు వేయకుండా తనకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉంటుంది. గత వారం వరకు కూడా పృథ్వి, విష్ణు బాగానే ఉండే వాళ్ళు. అయితే వీరి మధ్యలో ఎప్పుడైతే యష్మి దూరిందో అప్పటి నుంచి పృథ్వి, విష్ణు మధ్య దూరం పెరుగుతోంది. పృథ్వీ కూడా విష్ణు కి దూరం అయ్యాడు. దీనికి తోడు ఈ వారం జరిగిన నామినేషన్స్ లో అందరూ కూడా పృథ్వి, విష్ణు రిలేషన్ టార్గెట్ చేస్తూ నామినేషన్స్ చేయడం, దీనికి యష్మీ పృథ్వి కి కూడా క్లాస్ పీకడం అన్నీ జరిగిపోయాయి. దీంతో పృథ్వీ కూడా విష్ణు ని రోజు కొక యాంగిల్ లో టార్చర్ పెడుతున్నాడు.
ఇక పూర్తిగా ఆమెను దూరం పెట్టడంతో విష్ణు నరకం అనుభవిస్తోంది అని చెప్పవచ్చు. ఇక అసలు విషయంలోకి వెళితే.. నిన్న ఎపిసోడ్ చివర్లో విష్ణు, యష్మీ మధ్య ఒక చిన్న వాదన జరిగింది. ఈ వాదనలో యష్మీ మళ్లీ సైకోలాగే ప్రవర్తించిందని చెప్పవచ్చు. నిన్నటి ఎపిసోడ్ కి కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయనకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆయన సినిమాల్లోని సూపర్ హిట్ పాటలకు కంటెస్టెంట్స్ అందరూ కూడా జోడీలుగా మారి డాన్స్ చేయాలని బిగ్ బాస్ చెబుతాడు. ఊహించినట్టుగానే బిగ్ బాస్ యష్మీ – నిఖిల్ ని ఒక జంటగా, పృథ్వి – విష్ణు ని ఒక జంటగా బిగ్ బాస్ నిర్ణయించాడు. అయితే పృథ్వీ మాత్రం విష్ణు తో డాన్స్ చేయడం ఇష్టం లేక వంటింట్లోకి వచ్చి అంట్లు తోముకుంటూ కనిపిస్తాడు. దాంతో విష్ణు ప్రియ అక్కడికి వచ్చి అందరూ రిహార్సల్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడకి వచ్చి అంట్లు తోముతున్నావేంటి..? నాతో డాన్స్ చేయడం ఇష్టం లేదా.? అని అడగగా నీతోనే కాదు.. హౌస్ లో ఎవరితో చేయడానికి అయినా నేను రెడీ అంటూ పృథ్వీ అంటాడు. మరి నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అని విష్ణు అడుగుతుంది. నీకు స్టెప్స్ తెలుసా..? తెలిస్తే ప్రాక్టీస్ చేద్దాం పదా ? అని అంటాడు పృథ్వీ. అతనిలోని ఇబ్బందిని గమనించిన విష్ణు ప్రియ దయచేసి మా జోడిని మార్చండి బిగ్ బాస్ అంటూ వేడుకుంది. ఇక బిగ్ బాస్ విష్ణు ప్రియా రిక్వెస్ట్ ను అంగీకరిస్తూ విష్ణు – నిఖిల్ ఒక జోడిగా, యష్మీ – పృథ్వీ ఒక జోడిగా బిగ్బాస్ తెలిపాడు. ఇక్కడి నుండే అసలు రచ్చ మొదలైంది.
యష్మీ చేసిన ఓవరాక్షన్ మామూలుగా లేదు. నిఖిల్ తో డాన్స్ వేయకపోతే నేను చచ్చిపోతాను అనే రేంజ్ లో రెచ్చిపోయింది.. నీ వల్ల నా సంతోషం పోయింది. నువ్వు చెప్పబట్టే బిగ్ బాస్ మా జోడిని మార్చాడు.. నీకు ఒక్క ప్రెసెంట్ కూడా కన్సర్న్ లేదు అంటూ విష్ణుప్రియ పై లేనిపోని అభాండాలు వేసి ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. మొత్తానికైతే యష్మీ , పృథ్వీ కలిసి విష్ణు ప్రియ కు ను నరకం అంటే ఏంటో చూపిస్తున్నారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.