Vijaysai Reddy: కొన్నాళ్లుగా జగన్, షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించిన వార్ నడుస్తోంది. తనకు రావాల్సిన ఆస్తిని జగన్ ఇవ్వటం లేదంటూ షర్మిల ఆరోపిస్తున్నారు. మీడియా వేదికగా తన అన్నపై ఆమె మాటల యుద్ధం చేస్తున్నారు. శనివారం మీడియా సమావేశంలోనూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ ఫామిలీ ఆస్తుల వివాదంపై విజయ్ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల ఆత్మవిమర్శ చేసుకోవాలని వైసీపీ అద్యక్షుడు విజయ సాయిరెడ్డి అన్నారు. తండ్రి మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం చాలా దుర్మార్గం అంటూ విజయ సాయి రెడ్డి మండి పడ్డారు. ఆమె తగాదా అంతా ఆస్తి కోసం కాదని, అధికారం కోసమని మండిపడ్డారు. ఆస్తి కోసం పోరాటం చేస్తున్నాంటూ సొంత అన్నపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం సరికాదని సాయిరెడ్డి అన్నారు. జగన్‌కు ఉన్న ఇమేజ్ దెబ్బతీసేందుకే తెలుగుదేశం పార్టీతో షర్మిల చేతులు కలిపారంటూ ధ్వజమెత్తారు. ఆస్తికి సంబంధించిన అంశమైతే.. కుటుంబసభ్యులతో చర్చించుకోవాలి తప్ప… ఇలా అన్న పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించటం సరికాదన్నారు సాయిరెడ్డి. మీ స్వలాభం కోసం ఏమైనా చేసేస్తారా అంటూ షర్మిలను ప్రశ్నించారు. మీ నాన్న వైఎస్ మరణానికి కారకులు ఎవరో నీకు తెలియదా అని సాయిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మాట్లాడుతున్నారని సాయి రెడ్డి అన్నారు. విజయమ్మ కన్నీళ్లు తుడిచేందుకు షర్మిల ప్రెస్ మీట్ పెట్టలేదు.. జగన్ ను తిట్టడానికే పెట్టిందని సాయి రెడ్డి ఫైర్ అయ్యారు. షర్మిల జగన్ పై యుద్ధం చేస్తోందన్నారు. జగన్ తిరిగి మళ్లీ సీఎం కాకూడదన్న సంకల్పంతోటే షర్మిల ఇలా చేస్తుందని సాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read: జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ కీలక వ్యక్తులు
జగన్ బెయిల్ రద్దు కావాలని.. చంద్రబాబు అజెండాను షర్మిల పనిచేస్తుందని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్‌గా షర్మిల ప్రెస్ మీట్ పెట్టారా..? లేకా వైఎస్ కమార్తెగా షర్మిళ ప్రెస్ మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. అసలు.. షర్మిల కోపం ఎవరిమీదో చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆమె ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అర్థమవుతోందని.. అయితే… దానికి కారణాలేంటో చెప్పాలని ప్రశ్నించారు సాయిరెడ్డి.
జగన్ పై మహిళల్లో వ్యతిరేకత పెంచాలన్న దృక్పధంతో చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడని.. ఆ విషయాన్ని మీరు గమనిస్తే మంచదని విజ్ఞప్తి చేశారు. ఆస్తుల ట్రాన్స్ ఫర్ విషయంలో చంద్రబాబు హస్తం ఉందని సాయిరెడ్డి అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు ప్రత్యర్ధులు అంతా కుట్ర చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో విబేధించిన తర్వాత జగన్‌పై కేసులు ఎవరి పెట్టించారో.. దాని వెనుక ఎవరు ఉన్నారో షర్మిలకు తెలియదా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. అలాంటి వారికి మేలు కలిగేలా ప్రవర్తిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.